ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

WPL: గుజరాత్ జెయింట్స్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన ముంబై ఇండియన్స్

ABN, First Publish Date - 2023-03-04T21:52:34+05:30

గుజరాత్ జెయింట్స్ మహిళా క్రికెట్ జట్టు ముందు ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: గుజరాత్ జెయింట్స్ మహిళా క్రికెట్ జట్టు ముందు ముంబై ఇండియన్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (Women Premier League) తొలి మ్యాచ్‌‌లో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ మహిళా క్రికెట్ జట్టు 207 పరుగులు చేసింది. ప్రత్యర్థి అయిన గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) జట్టుకు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌ ఉమెన్స్ మైదానంలో చుక్కలు చూపించారు. బౌలర్లకు బంతి అందకుండా పరుగుల వరదపారించారు. ముంబై ఇండియన్స్ జట్టుపై గెలవాలంటే గుజరాత్ జెయింట్స్ 208 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.

అంతకుముందు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (Women Premier League) తొలి మ్యాచ్‌‌లో గుజరాత్ జెయింట్స్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ మూనీ టాస్ (Gujarat Giants) గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై ఇండియన్స్ మహిళా క్రికెట్ జట్టు (Mumbai Indians Women) బ్యాటింగ్‌కు దిగి ఆరంభంలోనే పరుగుల వరద పారించింది. హేలీ మాథ్యూస్ 31 బంతుల్లో 47 పరుగులు, నాట్ స్కివర్-బ్రంట్ 18 బంతుల్లో 23 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 27 బంతుల్లో 61 పరుగులు చేసింది. అమేలియా కెర్ 15 బంతుల్లో 26 పరుగులు చేసింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (Women Premier League)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తొలి మ్యాచ్‌ గుజరాత్‌ జెయింట్స్‌-ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరుగుతోంది.

Updated Date - 2023-03-04T22:40:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising