ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Athletics : ఆశలన్నీ నీరజ్‌పైనే!

ABN, First Publish Date - 2023-08-19T03:32:48+05:30

వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప్స(World Athletics Championships).. ప్రపంచ మేటి అథ్లెట్లు తలపడే గ్రాండ్‌ ఈవెంట్‌. ప్రతిష్ఠాత్మక పోటీలకు 28 మంది భారత అథ్లెట్లు అర్హత సాధించారు. అయితే, వీరిలో ఒలింపిక్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా(Olympic champion Neeraj Chopra) మినహా మిగతా వారిపై పెద్దగా పతక ఆశలు లేవు. కొందరు అనుభవం కోసం తలపడనుండగా.. వెటరన్లు తమ రికార్డులను మెరుగుపర్చుకోవడానికి చూస్తున్నారు.

నేటి నుంచి వరల్డ్‌ అథ్లెటిక్స్‌

చాంపియన్‌షి్‌ప్స 100 మీ. హర్డిల్స్‌లో జ్యోతిపై అంచనాలు

బుడాపెస్ట్‌ (హంగేరి): వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప్స(World Athletics Championships).. ప్రపంచ మేటి అథ్లెట్లు తలపడే గ్రాండ్‌ ఈవెంట్‌. ప్రతిష్ఠాత్మక పోటీలకు 28 మంది భారత అథ్లెట్లు అర్హత సాధించారు. అయితే, వీరిలో ఒలింపిక్‌ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా(Olympic champion Neeraj Chopra) మినహా మిగతా వారిపై పెద్దగా పతక ఆశలు లేవు. కొందరు అనుభవం కోసం తలపడనుండగా.. వెటరన్లు తమ రికార్డులను మెరుగుపర్చుకోవడానికి చూస్తున్నారు. శనివారం నుంచి ఇక్కడ జరిగే ఈ పోటీల్లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ కూడా బరిలో దిగుతోంది. అయితే, 100 మీ. హర్డిల్స్‌(100 m. Hurdles)లో జ్యోతి పతకం తెచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇటీవలే జరిగిన యూనివర్సిటీ గేమ్స్‌లో తన జాతీయ రికార్డును తానే అధిగమించిన జ్యోతి.. మెగా ఈవెంట్‌లో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది. ఇక, జావెలిన్‌త్రోలో నీరజ్‌తోపాటు డీపీ మను, కిశోర్‌ జానా కూడా అర్హత సాధించారు. మరోవైపు నిరుడు రజతం గెలిచిన నీరజ్‌ ఈసారి స్వర్ణంపై గురిపెట్టాడు.

ఈ సీజన్‌ డైమండ్‌ లీగ్‌ల్లో అదరగొడుతున్నా 90 మీ. మార్క్‌ను మాత్రం నీరజ్‌ అందుకోలేక పోతున్నాడు. మరి ఈ మెగా ఈవెంట్‌లోనే ఆ మైలురాయిని అందుకొని టైటిల్‌ నెగ్గుతానన్న ఆశాభావాన్ని నీరజ్‌ వ్యక్తం చేశాడు. మహిళల జావెలిన్‌ త్రోలో అన్నూ రాణి(Annu Rani) అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించిన లాంగ్‌ జంపర్లు జస్విన్‌ ఆల్ర్డిన్‌, మురళీ శ్రీశంకర్‌లు ఈ సీజన్‌లో బెస్ట్‌ జంప్‌లతో టాప్‌లో ఉన్నారు. పురుషుల 3000 మీ. స్టీపుల్‌ చేజ్‌లో అవినాష్‌ సబ్లే, మహిళల్లో పారుల్‌ చౌదరి తమ వ్యక్తిగత రికార్డులను మెరుగుపరచుకొనేందుకు సిద్ధమయ్యారు. కాగా, ట్రిపుల్‌ జంప్‌లో ప్రవీణ్‌ చిత్రవేల్‌, అబ్దుల్లా అబూబకర్‌, ఎల్డోస్‌ పాల్‌లు బరిలో నిలవనున్నారు. పురుషుల 35 కి.మీ రేస్‌ వాక్‌లో రామ్‌బాబు, 20 కి.మీ రేస్‌ వాక్‌లో పరమ్‌జీత్‌ సింగ్‌, ఆకాశ్‌దీ్‌ప సింగ్‌, వికాస్‌ సింగ్‌లకు ఈ అనుభం ఎంతో ఉపయోగపడనుంది. పురుషుల 800 మీటర్లలో కృష్ణన్‌ కుమార్‌, 1500 మీటర్లలో అజయ్‌, 400 మీ. హర్డిల్స్‌లో సంతోష్‌ మేటి అథ్లెటకు గట్టి పోటీ ఇస్తారో లేదో చూడాలి.

విదేశీ స్టార్లు:

విదేశీ స్టార్లలో స్ర్పింట్‌ క్వీన్‌ షెల్లీ అన్‌ ఫ్రేజర్‌, ఎలిన్‌ థాంప్సన్‌, పోల్‌వాల్ట్‌లో మాండో దుప్లాంటిస్‌, ట్రిపుల్‌ జంప్‌లో రికార్డులు తిరగరాస్తున్న యూలిమర్‌ రొజాస్‌, హర్డిల్స్‌ హీరో గ్రాంట్‌ హోలోవే తదితర మేటి అథ్లెట్లు ప్రపంచ చాంపియన్‌షి్‌పలో మెరుపులు మెరిపించడానికి సిద్ధంగా ఉన్నారు.

Updated Date - 2023-08-19T05:29:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising