Heath Streak: క్యాన్సర్‌తో దిగ్గజ క్రికెటర్ కన్నుమూత
ABN, First Publish Date - 2023-08-23T08:47:01+05:30
జింబాబ్వే దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ ఇక లేరు. 49 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. తన 12 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన దిగ్గజ ఆల్‌రౌండర్ జింబాబ్వేకు అనేక విజయాలు అందించారు.
జింబాబ్వే దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ ఇక లేరు. 49 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఈ విషయాన్ని జింబాబ్వే మాజీ క్రికెటర్ ఒలంగా తన ట్విట్టర్ ఖాతా వెల్లడించారు. తన 12 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన దిగ్గజ ఆల్‌రౌండర్ జింబాబ్వేకు అనేక విజయాలు అందించారు. 4 సంవత్సరాలపాటు కెప్టెన్‌గానూ జింబాబ్వేకు సేవలు అందించారు. టెస్టు క్రికెట్‌లో జింబాబ్వే తరఫున 100 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ హీత్ స్ట్రీకే కావడం గమనార్హం. 1993 నవంబర్ 10న సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా హీత్ స్ట్రీక్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. ఆ తర్వాతి నెలలోనే డిసెంబర్ 1 నుంచి పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి కూడా అడుగుపెట్టారు. రావల్పిండిలో జరిగిన కెరీర్ రెండో టెస్టులోనే 8 వికెట్లు పడగొట్టిన హీత్ స్ట్రీక్ అందరి దృష్టిని ఆకర్చించారు. 2000-2004 మధ్య జింబాబ్వేకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. 2005లో క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన చివరి మ్యాచ్‌ను 2005 సెప్టెంబర్ 20న టీమిండియాతో ఆడారు.
ఇక తన 12 ఏళ్ల కెరీర్‌లో 65 టెస్టు మ్యాచ్‌లాడిన హీత్ స్ట్రీక్ 216 వికెట్లు పడగొట్టారు. బ్యాటింగ్‌లో 22 సగటుతో 1,990 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ, 11 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 127గా ఉంది. ఇక 189 వన్డే మ్యాచ్‌లాడిన హీత్ స్ట్రీక్ 239 వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో 28 సగటుతో 2,943 పరుగులు చేశారు. ఇందులో 13 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యధిక స్కోర్ 79గా ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక హీత్ స్ట్రీక్ జింబాబ్వే, స్కాట్లాండ్, బంగ్లాదేశ్ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. ఐపీఎల్‌లో కూడా కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ లయన్స్ జట్లకు హీత్ స్ట్రీక్ కోచ్‌గా సేవలిందించారు. అయితే 2021లో అవినీతి నిరోధక ఉల్లంఘనల కారణంగా హీత్ స్ట్రీక్‌పై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం విధించింది.
Updated Date - 2023-08-23T12:14:18+05:30 IST