ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ChatGPT: చాట్‌జీపీటీతో మూణ్నెల్లలో రూ. 28 లక్షలు సంపాదించాడు.. ఎలాగో తెలుసా??

ABN, First Publish Date - 2023-04-02T16:32:14+05:30

చాట్‌జీపీటీ ఆధారంగా లాన్స్ జంక్ (lance junck) అనే 23 ఏళ్ల కుర్రాడు ఏకంగా మూడు నెలల కాలంలో రూ. 28 లక్షల మేర సంపాదించాడు. అదెలా సాధ్యమైందో తెలుసా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఓపెన్ ఏఐ (Open AI) ద్వారా అభివృద్ధి చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పాపులర్ అవుతున్న విషయం తెలిసిందే..! చాలా మంది విద్యార్థులు తమ అసైన్‌మెంట్లను రాయడానికి, టీచర్లు విద్యార్థులకు కొత్త పద్ధతుల్లో బోధన చేయడానికి, శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు, వేగంగా కోడింగ్ రాయడానికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు (Software engineers), వెబ్ డెవలపర్లకు (web developers).. ఇలా విభిన్నవర్గాలకు చాట్‌జీపీటీ ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే.. చాట్‌జీపీటీ ఆధారంగా చేతినిండా డబ్బులు సంపాదించవచ్చని (Money earning) ఎవరైనా ఊహించగలరా?? చాట్‌జీపీటీ ఆధారంగా లాన్స్ జంక్ (lance junck) అనే 23 ఏళ్ల కుర్రాడు ఏకంగా మూడు నెలల కాలంలో రూ. 28 లక్షల మేర సంపాదించాడు.

ఎలా సంపాదించాడు?

లాన్స్ ఆన్‌లైన్‌లో ఓ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారాన్ని (Education) ప్రారంభించాడు. 15 వేల మంది విద్యార్థులు ఆ ప్లాట్‌ఫారంలో పేర్లను రిజిస్టర్ చేసుకున్నాడు. లాన్స్ కాన్సెప్ట్ ఏంటంటే.. చాట్ జీపీటీని ఎలా ఉపయోగించుకోవాలో పిల్లలకు నేర్పించడమే..! ఆ కోర్సుకు కంప్లీట్ గైడ్ ఫర్ బిగినర్స్ (complete guide for beginners) అని నామకరణం చేశాడు. చాట్‌జీపీటీని ఎలా వినియోగించుకోవాలి? ఎలా సమాధానాలు రాబట్టుకోవాలి? అని నేర్పడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. అలా మూణ్నెల్ల కాలంలో 35 వేల డాలర్లు(రూ. 28.4 లక్షలు) సంపాదించాడు. అతని ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారంలో ఇంకా ఈ కోర్సు హాట్‌కేక్ కావడం గమనార్హం.

ఈ సందర్భంగా లాన్స్ విలేకరులతో మాట్లాడుతూ.. చాట్‌జీపీటీ లాంటి గొప్ప ఆటోమేషన్ టూల్‌ను ప్రతిఒక్కరూ వినియోగించుకునేలా తాను తర్ఫీదునిస్తున్నట్లు చెప్పారు. చాలా మందికి చాట్‌జీపీటీని ఎలా వినియోగించుకోవాలో తెలియదనే విషయాన్ని గుర్తించి, వారికి తర్ఫీదునివ్వడం ద్వారా ఆదాయ మార్గాన్ని ఎంచుకున్నానని వివరించారు. ‘‘అంతకంటే ముందు.. చాట్‌జీపీటీపై పరిశోధన చేశాను. రోజూ గంటల కొద్దీ శోధించాను. ఓ నవలకు ఇంట్రో రాయడం, కవితలు, కథలు రాయడం.. ఇలా ఎన్నో అంశాలపై చాట్‌జీపీటీకి ప్రశ్నలను సంధించి, సమాధానాలు ఎలా ఉన్నాయో గుర్తించాను. ప్రోగ్రామింగ్ కోడ్‌లను కూడా అద్భుతంగా రాయగలదని తెలుసుకున్నాను. లింక్డిన్, గిట్‌హబ్, రెడిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై పోస్టులు చేయడం వంటి వాటిని కూడా చాట్‌జీపీటీ సులభంగా చేయగలదు. అవే అంశాలను నేను నా కోర్స్‌లో బోధించాను. 7 గంటల నిడివిగల కోర్సును రూపొందించాను. మొత్తం కోర్సుకు 20 డాలర్లు(రూ.1,643)గా కోర్సు ఫీజును నిర్ణయించాను’’ అని ఆయన వివరించారు.

లాన్స్ వద్ద పాఠాలు నేర్చుకుంటుందెవరంటే??

చాట్‌జీపీటీని తనగురించే పాఠాలను చెప్పమంటే.. చక్కగా బోధిస్తుంది. అయినా.. లాన్స్‌కు ఫీజు చెల్లించి మరీ పాఠాలు ఎవరు నేర్చుకుని ఉంటారు? ఈ ప్రశ్నకు సమాధానం వింటే మీరు ఆశ్చర్యపోతారు. లాన్స్ విద్యార్థుల్లో సింహభాగం అమెరికాకు చెందినవారే. వారితోపాటు.. రష్యా, గల్ఫ్ దేశాలు, వెనెజువెలా, కెనడా, జపాన్‌తో పాటు.. భారత్‌కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు.

Updated Date - 2023-04-02T16:33:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising