Apple iPhone 15 Pro: ఐఫోన్ 15 ప్రొ కోసం ఎదురుచూస్తున్నారా?.. ఈ విషయం తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోండి!
ABN, First Publish Date - 2023-01-30T20:15:53+05:30
ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 సిరీస్(iPhone 15 series) ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 సిరీస్(iPhone 15 series) ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 15(iPhone 15), ఐఫోన్ 15 ప్లస్(iPhone 15 Plus) వేరియంట్లతోపాటు హై ఎండ్ ఫోన్లు అయిన ఐఫోన్ 15 ప్రొ(iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్(iPhone 15 Pro Max)లేదంటే ఐఫోన్ 15 అల్ట్రా(iPhone 15 Ultra) ఉండే అవకాశం ఉంది.
హాప్టిక్ బటన్స్ నుంచి ర్యామ్ విస్తరణ వరకు ఈ ఫోన్ల ఫీచర్లకు సంబంధించి గత కొంతకాలంగా బోల్డన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి వై-ఫై 6E ఫీచర్(Wi-Fi 6E feature). ఈ ఫీచర్ ఐఫోన్ 15 సిరీస్ అన్నింటిలోనూ ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. అయితే, ఈ ఫీచర్ ప్రొ మోడల్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
మ్యాక్ రూమర్స్ (MacRumors) నివేదిక ప్రకారం.. వై-ఫై 6E కనెక్టివిటీ హై-ఎండ్ ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ వేరియంట్లకు మాత్రమే పరిమితం కానుంది. అంతకుముందటి నివేదికలు మాత్రం ఐఫోన్ 15 లైనప్ అన్నింటిలోనూ ఈ ఫీచర్ ఉంటుందని పేర్కొన్నాయి. బేస్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడల్స్ మాత్రం వైఫై6తోనే వస్తాయి.
యాపిల్ ప్రస్తుతం కొన్ని ఉత్పత్తులకు మాత్రమే వై-ఫై 6E కనెక్టివిటీని ఆఫర్ చేస్తోంది. ఇందులో మ్యాక్‌బుక్ ప్రొ-14 అంగుళాల 2023(MacBook Pro 14-inch 2023), మ్యాక్‌బుక్ ప్రొ 16 అంగుళాల 2023 (MacBook Pro 16-inch 2023), ఐప్యాడ్ ప్రొ 11 అంగుళాల (iPad Pro 11-inch) ఫోర్త్ జనరేషన్, ఐప్యాడ్ ప్రొ 12.9 అంగుళాల (iPad Pro 12.9 inch) సిక్స్త్ జనరేషన్, మ్యాక్ మినీ (Mac Mini 2023) వంటి వాటికి ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తోంది. వై-ఫై 6E సాధారణంగా ఉపయోగించే 2.4GHz, 5GHz బ్యాండ్‌లతో పాటు 6GHz బ్యాండ్‌లను కూడా ఉపయోగిస్తుంది. ఫలితంగా దాని విస్తృతమైన వైర్‌లెస్ బ్యాండ్ సపోర్ట్ కారణంగా వేగవంతమైన బదిలీ వేగం, తక్కువ జాప్యం ఉంటాయి.
ఐఫోన్ 15 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశం ఉంది. హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, పెరిగిన ర్యామ్, టైటానియం ఫ్రేమ్‌తో సాలిడ్-స్టేట్ బటన్‌లను కలిగి ఉంటుందని రూమర్లను బట్టి తెలుస్తోంది. అలాగే, 48-మెగాపిక్సెల్ వైడ్ లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని కూడా చెబుతున్నారు.
Updated Date - 2023-01-30T20:15:54+05:30 IST