ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meta vs Twitter: ట్విటర్‌కు పోటీగా రంగంలోకి దిగుతున్న మెటా!

ABN, First Publish Date - 2023-03-10T21:32:05+05:30

మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌(Twitter)కు పోటీ ఇచ్చేందుకు ఫేస్‌బుక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌(Twitter)కు పోటీ ఇచ్చేందుకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా(Meta) పావులు కదుపుతోంది. ట్విట్టర్‌కు పోటీగా మరో ప్లాట్‌ఫ్లామ్‌ను తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘మనీ కంట్రోల్’ నివేదిక ప్రకారం.. ట్విట్టర్‌కు మరో ప్రత్యర్థి అయిన మాస్టోడాన్(Mastodon) వంటి ఫెడరేటెడ్ యాప్‌లు ఉపయోగించే డీసెంట్రలైజ్‌డ్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్రొటోకాల్ అయిన యాక్టివిటీ పబ్ ఆధారంగా ఈ యాప్ ఉంటుంది. దీనికి పి92(P92) అనే సంకేతనామం పెట్టినట్టు నివేదిక పేర్కొంది.

మెటా తీసుకొచ్చే ఈ యాప్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) బ్రాండ్‌ కింద ఉంటుందని, ఇన్‌స్టాగ్రామ్ పాస్‌వర్డ్, యూజర్‌నేమ్‌తోనే దీనిలోనూ లాగిన్ కావొచ్చని చెబుతున్నారు. డీసెంట్రలైజ్‌డ్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్రొటోకాల్‌పై పనిచేస్తున్నట్టు మెటా కూడా అంగీకరించింది. ఇదే విషయాన్ని ఆ సంస్థ అధికార ప్రతినిధి కూడా నిర్ధారించారు. అయితే, యాప్ ఇంకా ఆలోచన దశలోనే ఉందా? లేదంటే అభివృద్ధి దశలో ఉందా? అన్న విషయంలో స్పష్టత లేదు. ఇది వర్కింగ్ దశలో ఉన్నట్టు ఈ విషయంతో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా తెలిసింది.

ట్విట్టర్ మస్క్(Elon Musk) చేతికి వెళ్లాక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. దీంతో అది తన యూజర్ల బేస్‌ను కూడా క్రమంగా కోల్పోతోంది. ఈ నేపథ్యంలో కొత్త యాప్‌ను తీసుకురావడం ద్వారా లాభపడొచ్చని, వారిని ఈజీగా ఆకర్షించవచ్చని మెటా భావిస్తోంది. ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ కాగానే ఇన్‌స్టాగ్రామ్ వెంటనే ‘రీల్స్’ ఫీచర్‌ను తీసుకొచ్చి టిక్‌టాక్ యూజర్లందరినీ అటువైపు గుంజేసుకుంది. ఈ రీల్స్ కూడా ఇంచుమించు టిక్‌టాక్‌ను పోలి ఉంటుంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఫీచర్ అత్యంత ప్రాచుర్యం పొందింది. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం.. పి92లో క్లికబుల్ లింక్స్, యూజర్ ప్రొఫైల్స్, ఇమేజెస్, వీడియోస్ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. అయితే, ఇతరుల వీడియోలు, మెసేజ్‌లకు కామెంట్ చేసే ఆప్షన్ తొలి వెర్షన్‌లో ఉంటుందా? లేదా? అన్నది తెలియరాలేదు.

Updated Date - 2023-03-10T21:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising