ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Truecaller: ఆ ఫీచర్‌ను మళ్లీ ప్రవేశపెట్టిన ట్రూకాలర్.. ఇకపై ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు..

ABN, First Publish Date - 2023-06-15T16:05:14+05:30

ఇంటర్నెట్ ఆధారంగా కాలర్-ఐడెంటిఫికేషన్, కాల్-బ్లాకింగ్, ఫ్లాష్ మెసేజింగ్, చాట్ అండ్ వాయిస్ వంటి ఫీచర్లు అందిస్తున్న ట్రూకాలర్ (True) యాప్‌‌కు యూజర్లలో చక్కటి ఆదరణ ఉంది. ఈ యాప్‌ను వాడుతున్నవారి సంఖ్య పెద్దగానే ఉంది. అయితే గతంలో యాప్స్‌పై గూగుల్ నియంత్రణ చర్యలు తీసుకున్న సందర్భంలో రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించిన ట్రూకాలర్ ఇప్పుడు ఆ ఫీచర్‌‌ను పున:ప్రవేశపెట్టింది. దీంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ ఆధారంగా కాలర్-ఐడెంటిఫికేషన్, కాల్-బ్లాకింగ్, ఫ్లాష్ మెసేజింగ్, చాట్ అండ్ వాయిస్ వంటి ఫీచర్లు అందిస్తున్న ట్రూకాలర్ (True) యాప్‌‌కు యూజర్లలో చక్కటి ఆదరణ ఉంది. ఈ యాప్‌ను వాడుతున్నవారి సంఖ్య పెద్దగానే ఉంది. అయితే గతంలో యాప్స్‌పై గూగుల్ నియంత్రణ చర్యలు తీసుకున్న సందర్భంలో రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించిన ట్రూకాలర్ ఇప్పుడు ఆ ఫీచర్‌‌ను పున:ప్రవేశపెట్టింది. దీంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రీమియం సబ్‌స్ర్కైబర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

అమెరికాలో ఐఓఎస్‌పై కాల్ రికార్డింగ్‌ను ప్రవేశపెట్టినట్టు ఇటివలే బ్లాగ్ పోస్టులో ట్రూకాలర్ పేర్కొంది. కాల్ రికార్డ్ అయ్యాక అది ట్రూకాలర్ యాప్‌లోకి యాక్సెస్‌బుల్ అవుతుంది. ఆ తర్వాత రికార్డెడ్ ఫైల్‌ను వినొచ్చు, పేరు మార్చుకోవచ్చు, డిలీట్ లేదా షేర్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. కాగా.. ఐఓఎస్‌పై థర్డ్ పార్టీ రికార్డర్ యాప్స్ మాదిరిగానే ట్రూకారల్ కూడా యాప్స్ పరిమితుల్లో పనిచేస్తుంది. కాగా ప్రస్తుతానికి అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్ త్వరలోనే ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఐఓఎస్‌లోని ఇతర థర్డ్-పార్టీ రికార్డర్ యాప్‌ల మాదిరిగానే ట్రూకాలర్ యాప్ కూడా యాపిల్ పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. అయితే యూజర్లు ఇన్‌కమింగ్ కాల్‌తో రికార్డింగ్ లైన్‌ను డయల్ చేయడం ద్వారా మెర్జ్ చేయాల్సి ఉంటుంది. ఇక కాల్ ముగిసిన తర్వాత రికార్డింగ్ సిద్ధంగా ఉందని నోటిఫికేషన్ వస్తుంది. ఇన్‌కమింగ్ కాల్స్ కోసం వినియోగదారులు కాంటాక్ట్ తర్వాత రికార్డింగ్ లైన్‌ను డయల్ చేసి, ఆపై కాల్‌లను మెర్జ్ చేయాల్సి ఉంటుంది.

Updated Date - 2023-06-15T16:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising