ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Twitter video app: లాంగ్ వీడియోలు ఫోన్‌లో చూడాల్సిన పనిలేదు... వచ్చేస్తోంది ట్విటర్ వీడియో యాప్..

ABN, First Publish Date - 2023-06-18T16:11:49+05:30

స్మార్ట్ టీవీల్లో ఇష్టమైన కంటెట్‌ని చూడడానికి యూట్యూబ్ యాప్‌కు వెళ్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎలాన్‌మస్క్‌కు చెందిన ట్విట్టర్ కూడా వీడియో కంటెంట్‌పై దృష్టి పెట్టింది. దీంతో త్వరలోనే ట్విట్టర్ వీడియో యాప్ టీవీల్లో రాబోతుంది. ఈ విషయాన్ని ఎలాన్‌మస్కే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా యూజర్‌తో జరిగిన సంభాషణలో ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నేళ్లుగా ఆన్‌లైన్ సెర్చింగ్ ఫ్లాట్‌ఫామ్‌లలో గూగుల్ (Google) ఆధిపత్యం చెలాయిస్తోంది. గూగుల్ మాదిరిగానే వీడియో కంటెట్‌లో యూట్యూబ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. యూట్యూబ్‌లో కంటెంట్ సృష్టికర్తలు, సినిమా ప్రేమికులు, గేమర్స్ వంటి వారితోపాటు ఇతర వీడియోలను చూసే వారు కూడా చురుకుగా ఉంటున్నారు. యూట్యూబ్ యాప్ ప్రస్తుతం స్మార్ట్ టీవీల్లో కూడా అందుబాటులో ఉంది. దీంతో స్మార్ట్ టీవీల్లో ఇష్టమైన కంటెట్‌ని చూడడానికి యూట్యూబ్ యాప్‌కు వెళ్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎలాన్‌మస్క్‌కు చెందిన ట్విట్టర్ కూడా వీడియో కంటెంట్‌పై దృష్టి పెట్టింది. దీంతో త్వరలోనే ట్విట్టర్ వీడియో యాప్ టీవీల్లో రాబోతుంది. ఈ విషయాన్ని ఎలాన్‌మస్కే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా యూజర్‌తో జరిగిన సంభాషణలో ప్రకటించారు.

ఫోన్‌లో ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను చూడడం కష్టం. కనుక స్మార్ట్ టీవీలో ట్విట్టర్ వీడియో యాప్ ఎలా ఉపయోగపడుతుందని ట్విట్టర్ యూజర్ ఒకరు ట్వీట్‌ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్‌ ‘‘ఇది వస్తోంది’’ అని సమాధానమిచ్చారు. ‘‘మాకు నిజంగా స్మార్ట్ టీవీల్లో ట్విట్టర్ వీడియో యాప్ అవసరం. నేను మొబైల్‌లో గంట నిడివి గల వీడియోలను చూడలేకపోతున్నాను’’ అని సదరు యూజర్ రాసుకొచ్చారు. దీనికి మస్క్ ఇది వస్తోందని బదులిచ్చాక.. దానికి సమాధానంగా సదరు యూజర్ అభినందనీయమని పేర్కొన్నాడు. తాను యూట్యూబ్ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటానని, మళ్లీ తాను దానిని చూడకూడదనుకుంటున్నానని చెప్పడం గమనార్హం.

కాగా గత నెలలోనే ట్విట్టర్ తమ ప్లాట్‌ఫామ్‌పై 2 గంటల నిడివి గల వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు అనుమతించింది. దీంతో ఈ మైక్రో బ్లాగింగ్ సైట్‌పై పలువురు యూజర్స్ ఇప్పటికే సినిమాలను అప్‌లోడ్ చేశారు. ఇది వచ్చాకే జాన్ విక్ చాప్టర్ 4 సినిమా విడుదలైన కొన్ని రోజులకే ట్విట్టర్‌లో లీకైంది.

భవిష్యత్‌లో తీసుకురాబోయే మరిన్ని ఫీచర్ల గురించి కూడా ఎలాన్ మస్క్ ప్రకటించాడు. యూజర్ ట్విట్టర్‌లో స్క్రోలింగ్ చేసుకుంటూ వీడియోలను చూడవచ్చు. పెద్ద వీడియోలనే చూసేటప్పుడు 15 సెకన్లు వెనుకకు ముందు జరిపేందుకు వీలుగా.. ఫర్‌వడ్, బ్యాక్ బటన్ కూడా తీసుకురాబోతున్నారు. అయితే ఈ ఫీచర్ గురించి మస్క్ నెల రోజుల క్రితమే ప్రకటన చేశాడు. కానీ ట్వీట్టర్‌లో ఇది ఇంకా రాలేదు.

Updated Date - 2023-06-18T16:28:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising