Twitter: వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చిన ఎలాన్ మస్క్.. ఇకపై ట్విట్టర్ వాడాలంటే ఏడాదికి..
ABN, First Publish Date - 2023-10-18T12:18:55+05:30
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విటర్) నూతన వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. ఎక్స్‌లో ‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఎక్స్‌లో నూతనంగా ఖాతా తెరిచే వినియోగదారులు సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విటర్) నూతన వినియోగదారులకు బిగ్ షాకిచ్చింది. ఎక్స్‌లో ‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఎక్స్‌లో నూతనంగా ఖాతా తెరిచే వినియోగదారులు సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఎక్స్‌లో ట్వీట్లు పెట్టడం, లైక్‌లు కొట్టడం, వేరే వాళ్లు పెట్టిన ట్వీట్లను రిట్వీట్లు చేయడం, ఇతరులకు రిప్లై ఇవ్వాంటే, బుక్ మార్కింగ్ చేయడం వంటివి చేయాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు నూతన వినియోగదారులు ఏడాది ఒక డాలర్ చెల్లించాలి. అలా కాకుండా ఖాతా తెరిచి ఇతరులు పెట్టిన ట్వీట్లను చదవడం, ఫోటోలు, వీడియోలు చూడడం, ఇతరులను ఫాలో కావడం మాత్రమే చేయాలనుకుంటే ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరుల ట్వీట్లకు స్పందించాలనుకుంటేనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీజు కూడా ఆయా దేశాలను బట్టి మారుతుందని ఎక్స్ పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పటికే ఎక్స్ ఖాతా కల్గి ఉన్న వారికి ఈ నిబంధనలు ఏవి కూడా వర్తించవు. వారు ఎప్పటిలాగే యథేచ్ఛగా తమ ఖాతాను వాడుకోవచ్చు. కేవలం కొత్తగా ఖాతా తెరిచే వినియోగదారులు మాత్రమే ఏడాది ఒక డాలర్ చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఈ ఫీచర్‌ను ఇంకా అన్ని దేశాల్లో ప్రవేశపెట్టలేదు. ప్రయోగాత్మకుంగా ప్రస్తుతం న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో మాత్రమే ఈ నాట్ ఎ బాట్ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్కడ విజయవంతమైతే త్వరలోనే అన్ని దేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. నకిలీ ఖాతాలను అరికట్టడమే ఈ కొత్త ఫీచర్ తీసుకురావడం వెనుక గల ఉద్దేశమని ఎక్స్ పేర్కొంది. ఈ నూతన ఫీచర్‌తో ఆటోమేటేడ్ బాట్ అకౌంట్లను, స్పామ్ అకౌంట్లను తగ్గించవచ్చన ఎక్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కాగా ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి అనేక మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. యాప్ పేరుతోపాటు లోగోను కూడా మార్చేశారు. బ్లూటిక్ కావాలనుకునే వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. అలాగే ఎక్స్ ప్రీమియం పేరిట సబ్‌స్ర్కిప్షన్ ఫీజును కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా వినియోగదారులకు ట్వీట్లను ఎడిట్ చేయడం, సుదీర్ఘ ట్వీట్లను పోస్ట్ చేయడం, ఫోల్డర్ల బుక్ మార్క్, యాప్ ఐకాన్‌ను నచ్చినట్లుగా మార్చుకోవడం కోసం అదనపు ఫీచర్లను అందిస్తున్నారు.
Updated Date - 2023-10-18T12:22:41+05:30 IST