ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

5G Mobiles: రూ.15 వేల లోపు ధరతో మంచి 5జీ మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..

ABN, First Publish Date - 2023-11-26T13:30:33+05:30

ప్రస్తుతం మార్కెట్‌లో అంతా 5జీ ట్రెండ్ నడుస్తోంది. వినియోదారులంతా 5జీ మొబైల్సే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కుర్రాళ్ల నుంచి వృద్ధుల వరకు 5జీ మొబైలే కావాలంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. 5జీ మొబైల్స్‌లో ఇంటర్నెట్ చాలా వేగంగా ఉండనుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో అంతా 5జీ ట్రెండ్ నడుస్తోంది. వినియోదారులంతా 5జీ మొబైల్సే కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కుర్రాళ్ల నుంచి వృద్ధుల వరకు 5జీ మొబైలే కావాలంటున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. 5జీ మొబైల్స్‌లో ఇంటర్నెట్ చాలా వేగంగా ఉండనుంది. ఎందుకంటే గతంలో మాదిరిగా నెట్‌లో ఏదైనా సెర్చ్ చేస్తే అది నిదానంగా వచ్చేవరకు ఎదురుచూసే ఓపిక ఇప్పుడు ఎవరికీ లేదు. ఇలా సెర్చ్ చేశామా? అలా వచ్చేయాలి అంతే.. ఇక ఎంత పెద్ద వీడియోలైనా క్షణాల్లో డౌన్‌‌లోడ్ అయిపోవాలి అని చాలా మంది కోరుకుంటున్నారు. పలువురైతే ఆ తరహా మొబైల్స్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. ఇలాంటి సమయంలో 5జీ మొబైల్స్ మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఇంకేముందు వినియోగదారులంతా 5జీ మొబైల్స్ కోసం ఎగబడుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే కొంతకాలం తర్వాత మార్కెట్‌లో 4జీ మొబైల్స్ కనిపించకపోవచ్చు. 2జీ, 3జీ మొబైల్స్ మాదిరిగానే 4జీ ఫోన్‌లు కూడా అరుదుగా దొరికే అవకాశాలుంటాయి. అయితే చాలామంది దగ్గర ఎక్కువ డబ్బులు పెట్టి 5జీ మొబైల్స్ కొనే స్థితి ఉండదు. దీంతో వీలైనంత తక్కువ ధరకే 5జీ మొబైల్స్ కొనడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ యాప్ అమెజాన్‌లో రూ.15 వేల లోపు ధరతో ఉన్న బెస్ట్ 5జీ మొబైల్స్‌ను ఓ సారి పరిశీలిద్దాం.


శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ(SAMSUNG Galaxy M14 5G)

4జీబీ రామ్, 128జీబీ స్టోరేజ్ గల ఈ 5జీ మొబైల్ ధర రూ.14,990గా ఉంది. ఈఎమ్‌ఐ, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఈ మొబైల్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఐసీవై సిల్వర్, బెర్రీ బ్లూ, స్మోకీ టీల్(smoky teal) రంగుల్లో ఉంది. ఈ మొబైల్స్ ఫీచర్ల విషయానికొస్తే.. 1330 ఆక్టాకోర్(Octa Core) 2.4జీహెచ్ 5ఎన్‌ఎమ్ ప్రాసెసర్, వన్ యూఐ 5.0 ఇంటర్‌ఫేజ్ ఉంది. మెయిన్ కెమెరా 50ఎంపీ+2ఎంపీ+2ఎంపీతో కూడిన ట్రిపుల్ సెటప్‌గా ఉంది. అలాగే 50ఎంపీ ట్రూ మెయిన్ కెమెరా ఉంది. ఇక ఫ్రంట్ కెమెరా 2ఎంపీ+2ఎంపీ+13ఎంపీగా ఉంది. 6000mAh గల లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. అలాగే మొబైల్‌కు ఒక సంవత్సరం వారెంటీ కూడా ఉంది. మొబైల్ సైజ్ 6.6 ఇంచులుగా ఉండగా.. 1080 x 2408 పిక్సల్స్ రిసోల్యూషన్ ఉంది.

ఐక్యూ జడ్6 లైట్ 5జీ మొబైల్ (iQOO Z6 5G)

6జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ కల్గిన ఈ 5జీ మొబైల్ ధర రూ.12,999 మాత్రమే. స్టీలర్ గ్రీన్, మైస్టిక్ నైట్ రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ మైబైల్స్‌పై ఈఎంఐ అవకాశంతోపాటు బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ మొబైల్ ఫీచర్ల విషయానికొస్తే వరల్డ్స్ ఫస్ట్ స్నాప్‌డ్రాగన్ నాల్గో జనరేషన్ 1 ప్రాసెసర్ కల్గి ఉంది. 120హెచ్‌జడ్ స్ర్కీన్ రిఫ్రెష్ రేట్‌ను కల్గి ఉంది. దీని బ్యాటరీ కెపాసిటీ 5000mAhగా ఉంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 127 గంటల వరకు పాటలు వినొచ్చు. లేదా సోషల్ మీడియాను 21.6 గంటలు వినియోగించవచ్చు. ఓటీటీలో 14.5 గంటలపాటు సినిమాలు లేదంటే 8.3 గంటపాటు గేమ్స్ ఆడొచ్చు. దీన్ని మెయిన్ కెమెరా 50 ఎంపీగా ఉంది.

రెడ్‌మీ 12 5జీ (Redmi 12 5G)

8జీబీ రామ్, 256 స్టోరేజ్ కల్గిన రెడ్ మీ 12 5జీ జేడ్ బ్లాక్ మొబైల్ అమెజాన్‌లో రూ.14,999కే లభిస్తోంది. ఇదే మొబైల్స్ 4జీబీ రామ్, 6జీబీ రామ్‌లోనూ అందుబాటులో ఉండడం గమనార్హం. 4జీబీ రామ్ ఉంటే ధర రూ.11,999గా, 6జీబీ రామ్ ఉంటే రూ.13,499గా ఉంది. ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ మొబైల్ ఫీచర్ల విషయానికొస్తే.. నాల్గో జనరేషన్ గల స్నాప్‌డ్రాగన్ ఉంది. డిస్‌ప్లే సైజ్ 17.24 సెంటి మీటర్లుగా ఉంది. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ గల ప్రొటెక్షన్ గల ఫుల్ హెచ్‌డీ+90 హెచ్‌జడ్ అడాప్టివ్‌సింక్ డిస్‌ప్లే ఉంది. 50 ఎంపీ గల డ్యూయల్ మెయిన్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా 8 ఎంపీగా ఉంది. బ్యాటరీ కెపాసిటీ 5000mAhగా ఉంది. 22.5W గల ఛార్జర్ కూడా మొబైల్ వెంట రానుంది. ఈ మొబైల్సే కాకుండా రియల్‌మీ నార్జో 60 ఎక్స్ 5జీ, నోకియా జీ42 5జీ, లావా బ్లేజ్ 5జీ, లావా బ్లేజ్ ప్రొ 5జీ, శాంసంగ్ ఎఫ్ 14 5జీ వంటి పలు మొబైల్స్ కూడా రూ.15 వేల లోపు ధరకే లభిస్తున్నాయి. కాబట్టి రూ.15 వేల లోపు ధరతో 5జీ మొబైల్స్ కావాలనుకునేవారి అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లపై ఓ లుక్కేయండి.

Updated Date - 2023-11-26T13:30:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising