BRS to Congress: ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు షాక్
ABN, First Publish Date - 2023-10-17T03:51:38+05:30
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో అధికార పార్టీ బీఆర్‌ఎ్‌సకు పెద్ద షాక్ తగిలింది. రెండు జిల్లాల్లో ఇద్దరు మునిసిపల్
పార్టీకి రాజీనామా చేసిన మహిళా
ఆర్థిక సహకార సంస్థ చైర్‌పర్సన్ ఆకుల లలిత
బోధన్, హుజూర్‌నగర్ మునిసిపల్ చైర్‌పర్సన్లు,
పద్మావతి, అర్చన, పలువురు కౌన్సిలర్ల రాజీనామా
రేవంత్, ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
నిజామాబాద్/హుజూర్‌నగర్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో అధికార పార్టీ బీఆర్‌ఎ్‌సకు పెద్ద షాక్ తగిలింది. రెండు జిల్లాల్లో ఇద్దరు మునిసిపల్ చైర్‌పర్సన్లు, పలువురు కౌన్సిలర్లు బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్‌పర్సన్ ఆకుల లలిత కూడా బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశారు. ఆమె కూడా కాంగ్రె్‌సలో చేరనున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మునిసిపల్ చైర్‌పర్సన్ పద్మావతి, ఆమె భర్త తూము శరత్‌రెడ్డితో పాటు 9 మంది కౌన్సిలర్లు బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి సోమవారం హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఎమ్మెల్యే షకీల్ వైఖరికి నిరసనగా బీఆర్‌ఎ్‌సను వీడినట్లు వారు తెలిపారు. ఆకుల లలిత సోమవారం సాయంత్రం తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. బీఆర్‌ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీల, కార్పొరేటర్లు పడుతున్న బాధలు వర్ణనాతీతమని లేఖలో పేర్కొన్నారు. ఆమె రాహుల్ యాత్ర సందర్భంగా కాంగ్రె్‌సలో చేరనున్నారు.
అధికార పార్టీకి కుదుపు
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మునిసిపల్ చైర్మన్ గెల్లి అర్చన, ఆమె భర్త రవి, ముగ్గురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఝలక్ ఇచ్చారు. ఆయన సీఎం కేసీఆర్ దగ్గర బీఫారం తీసుకున్న రోజే అర్చన-రవి దంపతులు, కౌన్సిలర్లు అమరబోయిన సతీష్, వీర్లపాటి గాయత్రి, గుంజె భవానీ బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేసి నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. ఎమ్మెల్యే సైదిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న రవి బీఆర్‌ఎ్‌సను వీడటం బీఆర్‌ఎ్‌సను ఒక కుదుపు కుదిపింది. రవి కూడా సైదిరెడ్డితో పాటే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే నాలుగు నెలల నుంచి వారి మఽధ్య విభేదాలు పొడచూపాయి. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అనంతరం సీఎం కేసీఆర్ మునిసిపాలిటీకి రూ.25 కోట్లు విడుదల చేశారు. ఆ నిధులతో చైర్‌పర్సన్, కౌన్సిలర్లు పనులు చేయాల్సి ఉంది. కానీ పబ్లిక్ హెల్త్ శాఖకు మళ్లించి ఎమ్మెల్యే సైదిరెడ్డి సొంతంగా పనులు చేయించారు. నాటి నుంచి కౌన్సిలర్లు, చైర్‌పర్సన్... ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి మునిసిపాలిటీ తీర్మానాలు కూడా పక్కన పెట్టి సొంత ఎజెండా అమలు చేస్తున్నారని చైర్‌పర్సన్ అర్చన రవి ఆరోపించారు.
వారికి కనీస గౌరవం ఇవ్వడం లేదు: ఉత్తమ్
బీఆర్‌ఎ్‌సలో స్థానిక సంస్థల ప్రతినిధులకు ఎలాంటి గౌరవం లేదని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మునిసిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఇచ్చిన కోట్ల రూపాయల నిధులను ఎమ్మెల్యే తాబేదారులకు అప్పగించి ప్రజాప్రతినిధులను పనిచేయనివ్వడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి వందల కోట్ల ప్రభుత్వ భూములు కబ్జా చేశారని, ఒక్కో మద్యం దుకాణం వద్ద రూ.4 లక్షల లంచం తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 80 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మరని, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదన్నారు.
Updated Date - 2023-10-17T08:10:59+05:30 IST