ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: పగుళ్లు తేలి ప్రమాదకరంగా మారిన అంతర్రాష్ట్ర రహదారి వంతెన...

ABN, First Publish Date - 2023-02-20T12:14:23+05:30

జిల్లాలోని జైనాథ్ తరోడా దగ్గర అంతర్రాష్ట్ర రహదారి వంతెన కుంగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్: జిల్లాలోని జైనాథ్ తరోడా దగ్గర అంతర్రాష్ట్ర రహదారి వంతె (Interstate Highway Bridge )న కుంగిపోయింది. పగుళ్లు తేలి ప్రమాదకరంగా మారింది. ఏ క్షణమైనా కూలిపోయేలా కనిపిస్తోంది. దీంతో వంతెన మీదుగా రాకపోకలను నిషేధించారు. ఆదిలాబాద్ (Adilabad) నుంచి మహారాష్ట్ర (Maharashtra) లోని చంద్రపూర్‌ (Chandrapur)ను అనుసంధానం చేస్తూ ఈ అంతర్రాష్ట్ర రహదారి ఉంది. దీనిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారిపై తరుణంవాగుపై 35 ఏళ్ల కిందట వంతెనను నిర్మించారు. వరదల ధాటికి ఏటా వంతెన కోతకు గురవుతూ వస్తోంది. ఇటీవల పగుళ్లు రావడంతో గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిరాలా, అడ గ్రామాల మీదుగా వాహనాలను మళ్లించారు. ఈక్రమంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంతెన నిర్మాణాన్ని చేపట్టాలంటూ బీజేపీ (BJP) ఆందోళనకు దిగింది.

ఈ వంతెనపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. జైనాథ్‌తో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి. ఈ నేపథ్యంలో వంతెన కుంగిపోతుండటం, పగుళ్లు రావడంతో రాకపోకలు నిలిపివేశారు. నిరాలా, అడ గ్రామాల మీదుగా వాహనాలను మళ్లిస్తున్నప్పటికీ అవన్నీ ఇరుకు దహదారులు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వీలైనంత త్వరగా వంతెనను పునర్న్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రహదారిని కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇటీవలే జాతీయ రహదారుల జాబితాలో చేర్చింది.

Updated Date - 2023-02-20T12:14:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising