KTR: మేం చెప్పేది అబద్ధమైతే ఓట్లు వేయకండి
ABN, First Publish Date - 2023-10-04T15:18:16+05:30
నిర్మల్ జిల్లా: అభివృద్ధి విషయంలో తాము చెప్పేది అబద్ధమైతే ఓట్లు వేయొద్దని.. ప్రధాని మోదీ గాలి మోటార్‌లో వచ్చి.. గాలి మాటలు చెప్పి వెళ్లి పోయారుని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
నిర్మల్ జిల్లా: అభివృద్ధి విషయంలో తాము చెప్పేది అబద్ధమైతే ఓట్లు వేయొద్దని.. ప్రధాని మోదీ (PM Modi) గాలి మోటార్‌లో వచ్చి.. గాలి మాటలు చెప్పి వెళ్లి పోయారని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. బుధవారం నిర్మల్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ (BRS) ఎవరికీ బీ టీమ్ (B team) కాదని... గుజరాత్‌కు గులాంలం కాదని, తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబు దారులమని స్పష్టం చేశారు. ఢిల్లీకి భయపడమని, ప్రధాని కితాబులు తమకొద్దన్నారు.
అన్ని ధరలు పెంచిన మోదీ దేవుడు అయితే.. అన్నీ చేసిన సీఎం కేసీఆర్ (CM KCR) దయ్యమట.. జన్ ధన్ (Jan Dhan) ఖాతా తెరిస్తే రూ. 15 లక్షలు వేస్తామని ప్రధాని చెప్పారని, నల్లధనం అంటూ తెల్ల ముఖం వేశారని కేటీఆర్ అన్నారు. రూ. 15 లక్షలు ఖాతాలో పడిన వాళ్ళు బీజేపీ (BJP)కే ఓటు వేయాలన్నారు. మోదీ వ్యాఖ్యలు చూస్తే నవ్వు వస్తోందని.. కేసీఆర్ తనను ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటే మోదీ అనుమతి అవసరమా? అని ప్రశ్నించారు. ప్రధాని అబద్దపు మాటలను ప్రజలు అర్ధం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
Updated Date - 2023-10-04T15:18:16+05:30 IST