BJP MP: ఎంపీ ల్యాడ్స్‌ను వాడుకున్నా.. బాపురావు సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-06-19T12:44:03+05:30
ఎంపీ ల్యాడ్స్ నిధులపై బీజేపీ ఎంపీ సోయం బాపు రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ల్యాడ్స్‌ను తన ఇంటి నిర్మాణంతో పాటు కొడుకు పెళ్లి కోసం వాడుకున్నానని బాపురావు ప్రకటించారు. జిల్లాలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎంపీలు మొత్తం నిధులు అమ్ముకున్నారని.. తాను మాత్రం కొన్ని నిధులు మాత్రమే వాడుకున్నట్లు బహిరంగంగా ఒప్పుకున్నారు.
ఆదిలాబాద్: ఎంపీ ల్యాడ్స్ నిధులపై (MP Lads) బీజేపీ ఎంపీ సోయం బాపు రావు (BJP MP Soyam Bapu Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ల్యాడ్స్‌ను తన ఇంటి నిర్మాణంతో పాటు కొడుకు పెళ్లి కోసం కూడా వాడుకున్నానని బాపురావు ప్రకటించారు. జిల్లాలో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎంపీలు మొత్తం నిధులు అమ్ముకున్నారని.. తాను మాత్రం కొన్ని నిధులు మాత్రమే వాడుకున్నట్లు బహిరంగంగా ఒప్పుకున్నారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay), అర్వింద్‌ల (Dharmpuir Arvind) కంటే తనకే ఎక్కువ నిధులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిధులను కార్యకర్తలందరికీ సమానంగా కేటాయిస్తానంటూ ఎంపీ బాపురావు వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఎంపీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన ఎంపీ ల్యాడ్స్‌ను ఇష్టానుసారంగా ఎలా వాడుకుంటారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల కోసం ఖర్చు చేయకుండా సొంత ప్రయోజనాలకు ఎంపీ నిధులను వాడటం పట్ల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ బాపురావుపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎంపీ వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల కూడా షాక్‌కొట్టినట్లైంది. మరి ఎంపీ బాపురావు వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
Updated Date - 2023-06-19T12:45:26+05:30 IST