Ajanta Express: అజంతా ఎక్స్‌ప్రెస్ ఇక.. కాచిగూడ నుంచి..
ABN, Publish Date - Dec 21 , 2023 | 07:41 AM
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే అజంతా ఎక్స్‌ప్రెస్(Ajanta Express) రైలు (17064) ఇక నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్(Kachiguda Railway Station)
బర్కత్‌పుర(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే అజంతా ఎక్స్‌ప్రెస్(Ajanta Express) రైలు (17064) ఇక నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్(Kachiguda Railway Station) నుంచి బయలదేరనుంది. బుధవారం సాయంత్రం 6.50 గంటలకు ఈ రైలు ప్రయాణికులతో కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరింది. గురువారం ఉదయం 8.05 గంటలకు మహారాష్ట్ర(Maharashtra)లోని మన్మాడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. మల్కాజిగిరి, బొల్లారం, మేడ్చల్, వడియారం, కామారెడ్డి, నిజామాబాద్, బాసర(Kamareddy, Nizamabad, Basara), ఔరంగాబాద్, నాగర్‌సోల్ మీదుగా మన్మాడ్ చేరుకుంటుందని కాచిగూడ రైల్వే స్టేషన్ డైరెక్టర్ కె.బాలాజీ తెలిపారు. తిరుగు ప్రయాణంలో గురువారం రాత్రి 8.50 గంటలకు మన్మాడ్ రైల్వే స్టేషన్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 9.35 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు.
Updated Date - Dec 21 , 2023 | 07:41 AM