ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ABN Exclusive : హైదరాబాద్‌లో మరో ఘోరం.. క్రీడాకారిణికి మంత్రి పేషీలోని ఉద్యోగి వేధింపులు

ABN, First Publish Date - 2023-08-14T22:33:59+05:30

దమ్మున్న ‘ఏబీఎన్’ చానెల్‌, ‘ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) దినపత్రికలో ప్రచురితమైన కథనాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చర్చనీయాంశం అయ్యాయి. గత రెండ్రోజులుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులపై వరుస కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే..

హైదరాబాద్ : దమ్మున్న ‘ఏబీఎన్’ చానెల్‌, ‘ఆంధ్రజ్యోతి’ (ABN-Andhrajyothy) దినపత్రికలో ప్రచురితమైన కథనాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ చర్చనీయాంశం అయ్యాయి. గత రెండ్రోజులుగా విద్యార్థినులపై లైంగిక వేధింపులపై వరుస కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి దెబ్బకు ఇప్పటికే హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ (Hakeempet Sports School) ఓఎస్డీ హరికృష్ణపై యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈ ఘటన మరువక ముందే మరో కీచకుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ‍ఒక్కటొక్కటిగా కీచకుల ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి బాధితుల ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై వేటువేసి.. విచారణ చేస్తున్న క్రీడా శాఖలోనే మరో కీచకుడి వికృత చేష్టలు వెలుగుచూశాయి. ఓ జాతీయ స్థాయి క్రీడాకారిణికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేషీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ సురేందర్ లైంగిక వేధింపులకు గురిచేశాడు.


కాళ్ల బేరానికి..!

‘నన్ను పర్సనల్‌గా కలువు, వీలైనప్పుడు ఫోన్ చెయ్యి. నీ పర్సనల్ ఫొటోలు పంపు.. నీ వయసు ఎంత..?’ అంటూ అశ్లీల మెసేజ్‌లు పంపాడు ఆ కామాంధుడు. వరుస మెసేజ్‌లతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు సురేందర్. ఈ వేధింపులు తాళలేక ఆ క్రీడాకారిణి ఇంట్లో చెప్పడంతో ఆమె బంధువు ఒకరు.. సురేందర్‌ను హెచ్చరించారు. తొలుత బుకాయించిన కీచక ఉద్యోగి సురేందర్.. తర్వాత కాళ్లు పట్టుకుంటా అని కాళ్ల బేరానికి వచ్చాడు. ఈ విషయం మంత్రికి చెప్పినా, మీడియాకు చెప్పినా సూసైడ్ చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. మరో ఇద్దరు ముగ్గురిపై కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడ్డట్లు నిర్థారణ అయ్యింది. ABN ఆంధ్రజ్యోతిని ఆశ్రయించిన బాధితురాలు తన గోడు చెప్పుకుంది. తన భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసు కేసు పెట్టలేకపోయానని ఏబీఎన్‌కు చెబుతూ బాధితురాలు తీవ్ర ఆవేదనకు లోనయ్యింది. ABNకు ఆడియో టేపులను కూడా ఆ క్రీడాకారిణి బంధువు అందజేశారు. వారం రోజుల క్రితమే విషయం తెలుసుకుని సదరు ఉద్యోగి సురేందర్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా మందలించారు. ఉద్యోగి సురేందర్‌ను పేషీ నుంచి తొలగించేశారు కూడా. ఓఎస్డీ హరికృష్ణ లైంగిక వేధింపులను ABN ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చిన వెంటనే సురేందర్‌ను సస్పెండ్ చేసి నష్టనివారణ చర్యలు చేపట్టారు మంత్రి.

సంచలన కథనం ఇదే..!

కాగా.. విద్యార్థినులపై ఓఎస్డీ హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడుతుండడంపై ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం ‘ఇక్కడా ఓ బ్రిజ్‌ భూషణ్‌!’ శీర్షికతో కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై మొట్టమొదటగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టి, పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ట్విటర్‌ వేదికగా క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరారు. ఆ వెంటనే స్పందించిన మంత్రి.. తన నివాసంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీ హరికృష్ణను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి


AP Politics : ఏపీ మంత్రి అమర్నాథ్‌పై దమ్మున్న ‘ఏబీఎన్’ ప్రశ్నల వర్షం.. సమాధానం చెప్పలేక..!


YuvaGalam : లోకేష్ ‘యువగళం’ ను అడ్డుకునేందుకు వైసీపీ ప్లాన్.. రంగంలోకి దిగిన కేశినేని చిన్ని..!


Breaking News : ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై ఆగంతకుల దాడి.. ఇదే ఘటన బీజేపీ నేతకు జరిగి ఉంటే..!?


KCR Govt : కేసీఆర్ మరో ఎలక్షన్ స్టంట్.. ఆగస్టు-15 వేళ తియ్యటి శుభవార్త!


Updated Date - 2023-08-14T22:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising