Gangula Kamalakar: నామినేషన్ తర్వాత మంత్రి గంగుల ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-11-08T13:14:42+05:30
కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు.
కరీంనగర్: కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ (BRS Candidate Gangula Kamalakar) నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఉదయం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు గెలిస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. కరీంనగర్ శాంతి భద్రతలు బాగుండాలంటే బీఆర్‌ఎస్ గెలవాలని అన్నారు. భూకబ్జా దారులకు ఓటేయ్యద్దని తెలిపారు. కేబుల్ బ్రిడ్జి కూలిపోవాలని కోరుకుంటున్నారా... ప్రతిపక్షాలకు ఇదేం కక్ష అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబుల్ బ్రిడ్జి కూలిపోయెందుకు బండి సంజయ్ (BJP Leader Bandi Sanjay) ఏమైనా చేస్తారా అని మండిపడ్డారు. తాము అభివృద్ధి చేస్తే.. ప్రతిపక్షాలు విధ్వంసం చేయాలని చూస్తున్నాయన్నారు. ఐదేళ్ల ఎంపీగా సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. ఒకరిద్దరు గెలిస్తే.. బీసీ సీఎం అవుతారా అని నిలదీశారు. బండి సంజయ్ అహంకారిలా మాట్లాడుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శలు గుప్పించారు.
Updated Date - 2023-11-08T13:14:43+05:30 IST