కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Results: రౌండ్ రౌండ్‌కీ మారుతున్న సీన్.. అంతుబట్టని రిజల్ట్..

ABN, First Publish Date - 2023-12-03T11:35:00+05:30

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రౌండ్ రౌండ్‌కీ సీన్ మారిపోతోంది. రిజల్ట్ అంతుబట్టడం లేదు. ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తున్నా కూడా కొన్ని చోట్ల ఫలితం రౌండ్ రౌండ్‌కీ మారిపోతోంది. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ హోరా హోరీ నడుస్తోంది.

Telangana Results: రౌండ్ రౌండ్‌కీ మారుతున్న సీన్.. అంతుబట్టని రిజల్ట్..

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రౌండ్ రౌండ్‌కీ సీన్ మారిపోతోంది. రిజల్ట్ అంతుబట్టడం లేదు. ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తున్నా కూడా కొన్ని చోట్ల ఫలితం రౌండ్ రౌండ్‌కీ మారిపోతోంది. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ హోరా హోరీ నడుస్తోంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మూడో స్థానంలో ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకూ పదికి పది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయింది.

సడెన్‌గా భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి హవా కనబరిచారు. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెనుకబడిపోవడం గమనార్హం. మంత్రి కేటీఆర్ సైతం ఒక రౌండ్‌లో ముందంజలో ఉంటే మరో రౌండ్‌లో వెనుకబడిపోతున్నారు. ఇక రౌండ్ రౌండ్‌కీ ఫలితం మారుతూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. హుజూరాబాద్‌లో బీజేపీ కీలక అభ్యర్థి ఈటల రాజేందర్ సైతం ఒక రౌండ్‌లో వెనుకబడిపోతే.. మరో రౌండ్‌లో పుంజుకుంటున్నారు. ఇక చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఇంకా ఒక్క రౌండ్ కూడా ఫలితాలు రాకపోవడం గమనార్హం. ఇక గోషా మహల్ స్థానం సైతం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఫలితాలు రౌండ్ రౌండ్‌కీ మారిపోతున్నాయి.

Updated Date - 2023-12-03T11:35:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising