ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Election: రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం పంది కొక్కుల్లా మెక్కారు: భట్టి విక్రమార్క

ABN, First Publish Date - 2023-11-26T13:52:13+05:30

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం మర్లపాడులో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

సత్తుపల్లి: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం మర్లపాడులో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రాగమయి దయానంద్‌ ప్రజా సేవ చేసిన నాయకులని అన్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు సంచులతో డబ్బులు వెదజల్లి బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తుందని అన్నారు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలలో మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగిందని, గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ ఒక్క అభివృద్ధి పని జరగలేదని మండిపడ్డారు.


బీఆర్ఎస్ నేతలు పందికొక్కుల్లాగా దొపిడి చేసి తెలంగాణ సంపదను దోచుకున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ భారీ మెజారిటీతో గెలుపొందనున్నాని, కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా రుణమాఫి చెయ్యని కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ది ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి రైతుకు ఎకరానికి రూ.15000 ఇస్తామని హామీ ఇచ్చారు. రైతు కూలీలకు రూ.12000 వేలు ఇస్తామని చెప్పారు. ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థులకు అందజేస్తామని, నిరుద్యోగం లేకుండా చేస్తామని, 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తామని చెప్పారు. కాంగ్రస్ మేనిఫెస్టో ఎలా సాధ్యమవుతుందని కేసీఆర్, కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని, ఈ విషయంలో వారికి సిగ్గుండాలని భట్టి విక్రమార్క మండిపడ్డారు. తెలంగాణలో సంపద బాగా ఉందని, అయితే కేసీఆర్ కుటుంబం పంది కొక్కుల్లా మెక్కారు కాబట్టే హామీలు అమలు చేయలేకపోయారని ఆరోపించారు. సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి రాగమయిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు.

Updated Date - 2023-11-26T13:52:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising