ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: ఈ కీలక శాఖలకు మంత్రులెవరు? ఎప్పుడు కేటాయిస్తారు?

ABN, First Publish Date - 2023-12-07T17:48:31+05:30

తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్ కొలువుదీరింది. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే వారికి శాఖలు కూడా కేటాయించారు.

హైదరాబాద్: తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్ కొలువుదీరింది. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే వారికి శాఖలు కూడా కేటాయించారు. మొత్తం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా 18 మందికి అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం సీఎంతో సహా 12 మందే ఆసీనులయ్యారు. రేవంత్ కేబినెట్‌లో ఇంకా ఆరుగురికి ఛాన్సుంది. అలాగే కీలక మైన శాఖలను ప్రస్తుతం రేవంత్‌రెడ్డి తన దగ్గరే ఉంచుకున్నారు. తెలంగాణలో ఐటీ శాఖకు చాలా ప్రాధాన్యత ఉంది. తెలంగాణకు ఐటీ శాఖే దిక్సూచి లాంటింది. అలాంటి పోస్టును ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి తన దగ్గరే ఉంచుకున్నారు. రెండో విడత కేబినెట్ విస్తరణలో ఆ కీలక పోస్టును మరొకరికి కేటాయిస్తారా? లేదంటే ఆయన దగ్గరే ఉంచుకుంటారో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.

బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ప్రధానంగా ఐటీ శాఖపైనే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు రావడానికి కేటీఆర్ కారణమంటూ పలువురు నెటిజన్లు ట్వీట్లు చేశారు. అలాంటి శాఖను కేటీఆర్ తర్వాత కాంగ్రెస్‌లో ఎవరు ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నలు తలెత్తాయి. శ్రీధర్‌బాబుకు ఐటీ శాఖ అప్పగిస్తారని అనుకున్నారు.. కానీ ఆయనకు ఆర్థిక శాఖను అప్పగిస్తూ రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సీఎం దగ్గరే ఐటీ, విద్యాశాఖ, విద్యుత్, పంచాయతీ రాజ్, రవాణా, కార్మిక, వ్యవసాయ, దేవాదాయ, సినిమాటోగ్రఫీ శాఖలు ఉన్నాయి. మరీ ఈ శాఖలను ఎవరికి కేటాయిస్తారో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ప్రస్తుత మంత్రుల శాఖలు ఇవే

ఉత్తమ్ కుమార్‌రెడ్డి-హోంశాఖ

దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్య శాఖ

భట్టి విక్రమార్క- డిప్యూటీ సీఎం, రెవెన్యూ

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-మున్సిపల్

తుమ్మల నాగేశ్వరరావు-రోడ్డు, భవనాల శాఖ

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి-ఇరిగేషన్

శ్రీధర్‌బాబు-ఆర్ధిక శాఖ

సీతక్క-గిరిజన సంక్షేమ శాఖ

జూపల్లి కృష్ణారావు-సివిల్ సప్లై

పొన్నం ప్రభాకర్-బీసీ సంక్షేమశాఖ

కొండా సురేఖ- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ

Updated Date - 2023-12-07T17:50:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising