ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress Party: చేతికి ఆయనే బలం.. గెలుపు క్రెడిట్ రేవంత్‌రెడ్డికే..!!

ABN, First Publish Date - 2023-12-03T18:30:17+05:30

Congress Party: ఎక్కువగా సీనియర్ నేతలు కనిపించే కాంగ్రెస్ పార్టీలో యువ నేత కావడం, మాటకారిగా పేరు పొందడం, ప్రజల్లో క్రేజ్ ఉండటం రేవంత్ రెడ్డికి బాగా కలిసొచ్చాయి. రేవంత్ ఎక్కడ సభలు నిర్వహించినా నేటి యువతరం రేవంత్ సీఎం అంటూ నినాదాలు చేయడం కనిపించేది. మరోవైపు అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉండటం కూడా రేవంత్‌రెడ్డికి ప్లస్ పాయింట్ అయ్యాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పదేళ్ల తర్వాత ప్రజలు పట్టం కట్టారు. అయితే ఆ పార్టీ్కి గెలుపు అంత సులువుగా రాలేదు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా క్రమశిక్షణ ఉండదని.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలను పట్టించుకోవడం వదిలేసి సొంత పార్టీ నేతలే తిట్టుకోవడం, కొట్లాటలు వంటివి ఉంటాయనే పేరు ఉండేది. అందుకే ప్రజలు కాంగ్రెస్ విషయంలో గతంలో ఆలోచించే పరిస్థితి ఉండేదని.. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయినా లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి పెరిగిపోవడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగి రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి దూకుడుగా వ్యవహరించారు. కొందరు సీనియర్ నేతలపై కఠినంగా వ్యవహరించారు. క్రమశిక్షణ ఉండదని ప్రచారం ఉన్న పార్టీలో నేతలను క్రమశిక్షణలో పెట్టారు. చివరకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా మారారు.

ఎక్కువగా సీనియర్ నేతలు కనిపించే కాంగ్రెస్ పార్టీలో యువ నేత కావడం, మాటకారిగా పేరు పొందడం, ప్రజల్లో క్రేజ్ ఉండటం రేవంత్ రెడ్డికి బాగా కలిసొచ్చాయి. రేవంత్ ఎక్కడ సభలు నిర్వహించినా నేటి యువతరం రేవంత్ సీఎం అంటూ నినాదాలు చేయడం కనిపించేది. మరోవైపు అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉండటం కూడా రేవంత్‌రెడ్డికి ప్లస్ పాయింట్ అయ్యాయి. దీంతో క్రమంగా రేవంత్‌రెడ్డి ఆదేశాలను కాంగ్రెస్ సీనియర్లు కూడా గౌరవించడం ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు గాలి వీచిందంటే దానికి ప్రధాన కారణం రేవంత్‌రెడ్డి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రేవంత్ రెడ్డినే సీఎం చేయాలనే డిమాండ్ వినిపించింది. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు ఉన్నా రేవంత్ రెడ్డికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండటాన్ని కాంగ్రెస్ అధిష్టానం కూడా గమనించింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని స్పష్టం కాగానే రేవంత్ రెడ్డి ఇంటికి భద్రత పెరిగింది. నేతలు, కార్యకర్తలు భారీగా రేవంత్ ఇంటికి తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఫిక్స్ చేసింది. సోమవారం నాడు రాజ్‌భవన్‌లో రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొత్తంగా అతి తక్కువ కాలంలో జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు ఎదిగి ఎంతో మంది రాజకీయ నేతలకు రేవంత్ రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-03T18:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising