DGP Anjani Kumar : ఓట్ల కౌటింగ్ భద్రతపై డీజీపీ ఏమన్నారంటే..?
ABN, First Publish Date - 2023-12-02T16:09:58+05:30
తెలంగాణ వ్యాప్తంగా రేపు జరగనున్న ఓట్ల కౌంటింగ్ భద్రతపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ( DGP Anjani Kumar ) సందేశం ఇచ్చారు. ఓట్ల లెక్కింపు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రేపు జరగనున్న ఓట్ల కౌంటింగ్ భద్రతపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ( DGP Anjani Kumar ) సందేశం ఇచ్చారు. ఓట్ల లెక్కింపు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ సెంటర్లలో ఫలితాలు వస్తున్న సమయంలో, కౌంటింగ్ సెంటర్ బయట కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రౌండ్ల వారీగా వస్తున్న వివరాలను బట్టి కౌంటింగ్ సెంటర్ బయట పోలీసు బందోబస్తును పై అధికారులు సమీక్షించాలని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగాకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వారి ఆస్తులకు కూడా భద్రత కల్పించామని చెప్పారు. గెలిచిన అభ్యర్థులు ర్యాలీ తీసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
Updated Date - 2023-12-02T16:10:00+05:30 IST