Election Exit Poll Results 2023: వామ్మో.. బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వస్తాయని తేలాయంటే..?
ABN, First Publish Date - 2023-11-30T18:16:44+05:30
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క పోటీ చేశారు. అయితే బర్రెలక్క భవితవ్యంపై ఎగ్జిట్ పోల్స్ ఏం చేప్తున్నాయి?.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క పోటీ చేశారు. అయితే బర్రెలక్క భవితవ్యంపై ఎగ్జిట్ పోల్స్ ఏం చేప్తున్నాయి?. బర్రెలక్క గెలుస్తుందా అనే అంశంపై ఆరా మస్తాన్ సర్వే వివరాలను వెల్లడించింది. బర్రెలక్కకు 15 వేల ఓట్లు రావచ్చని ఆరా మస్తాన్ సర్వే పేర్కొంది. అయితే ఈమె గెలవకపోయినా గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు గెలిచే అవకాశం ఉందని ఆరా సర్వే వెల్లడించింది.
కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మర్రికల్ గ్రామంలోని బూత్ నెంబర్ 12లో ఆమె ఓటు వేశారు. హైకోర్టు ఆదేశాలతో బర్రెలక్కకు ఈసీ సెక్యూరిటీ కూడా ఇచ్చింది. ఆ సెక్యూరిటీతోనే ఆమె పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు వేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బర్రెలక్క.. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు అందరూ పోలింగ్ కేంద్రాలకు రావాలని కోరారు.
Updated Date - 2023-11-30T18:46:50+05:30 IST