Vijayashanthi: కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చేసిన రాములమ్మ
ABN, First Publish Date - 2023-11-17T17:49:40+05:30
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీటు హామీతో విజయశాంతి హస్తం పార్టీలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి సొంత గూటికి వచ్చేశారు. గాంధీభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు. రాములమ్మకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీటు హామీతో విజయశాంతి హస్తం పార్టీలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే విజయశాంతి ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా కమలం పార్టీలో ఆమె అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. అసంతృప్తి నేతలతో రహస్య సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందుగానే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంటకస్వామి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అదే సమయంలో రాములమ్మ కూడా చెయ్యి పార్టీలోకి వెళ్లిపోతారని టాక్ నడిచింది. కానీ అప్పుడు చేరలేదు. మొత్తం మీద ఎంపీ సీటు హామీ మేరకు కాంగ్రెస్‌లో చేరినట్లు సమాచారం.
గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు విజయశాంతి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌లో నడుస్తోంది. ప్రధాన పార్టీలతో పాటు ఆయా పార్టీలు క్యాంపెయిన్ ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో విజయశాంతికి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగిస్తుందో వేచి చూడాలి. తాజాగా కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా ఖర్గే శుక్రవారం విడుదల చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాములమ్మకు మళ్లీ ప్రచార బాధ్యతలు అప్పగిస్తుందో.. లేదంటే ఇంకెలా ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి.
మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - 2023-11-17T18:06:14+05:30 IST