Harish Rao: బీజేపోడు గెలిస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని ఆ రోజే చెప్పినా..
ABN, First Publish Date - 2023-11-22T13:56:50+05:30
ప్రభుత్వం దౌల్తాబాద్ భూంపల్లిలో కుంట భూమి కూడా తీసుకునే ప్రసక్తి లేదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీలో మంత్రి హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రాము మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీల వద్ద ఉన్న పోరంబోకు భూములను పట్టా భూములుగా మార్చుతామన్నారు.
సిద్దిపేట : ప్రభుత్వం దౌల్తాబాద్ భూంపల్లిలో కుంట భూమి కూడా తీసుకునే ప్రసక్తే లేదని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. మిరుదొడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా బైక్ ర్యాలీలో మంత్రి హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీల వద్ద ఉన్న పోరంబోకు భూములను పట్టా భూములుగా మార్చుతామని వాగ్దానం చేశారు. గత ఉప ఎన్నికల్లో రఘునందన్ రావును ఎమ్మెల్యేగా గేలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
‘రఘునందన్ రావు ఢిల్లీ నుంచి పరిశ్రమ తెచ్చిండా? రైలు తెచ్చిండా? అని ఏమైనా నిధులు తెచ్చిండా?’ అని హరీష్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకమని.. ఒక విశ్వాసమని అన్నారు. బీజేపోడు గెలిస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని ఆ రోజే చెప్పానని, నిన్ననే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పారన్నారు. కేసీఆర్ మోటార్లకు మీటర్లు పెట్టలేదు కాబట్టి తెలంగాణకు వచ్చే 25 వేల కోట్లు ఆపామని నిర్మలమ్మ చెప్పారని అన్నారు. బోర్లకాడ మీటర్లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పెడుతున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారని హరీష్ రావు పేర్కొన్నారు.
Updated Date - 2023-11-22T14:12:01+05:30 IST