ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Imran Pratar Garhi : పువ్వాడ అజయ్‌ మైనార్టీలను వేదిస్తున్నాడు

ABN, First Publish Date - 2023-11-20T21:13:03+05:30

మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్( Puvvada Ajay Kumar ) మైనార్టీలను వేదిస్తున్నాడని రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతార్ గర్హి ( Imran Pratar Garhi ) మండిపడ్డారు.

ఖమ్మం : మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్( Puvvada Ajay Kumar ) మైనార్టీలను వేదిస్తున్నాడని రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతార్ గర్హి ( Imran Pratar Garhi ) మండిపడ్డారు. సోమవారం నాడు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలోఅజారుద్దీన్, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ప్రతార్ గర్హి మాట్లాడుతూ...‘‘పువ్వాడ అజయ్ నకిలీ ఖాన్. ఇది అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదు జీవితాలు మార్చే ఎన్నిక. 12 % రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశాడు. సంక్షేమ పథకాలను అమలు చేయని కేసీఆర్‌పై ఓటు ద్వారా ప్రతీకారం తీర్చుకోండి. సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోసగాళ్లు.. ఇద్దరు మంచి స్నేహితులు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిగా దోపిడి దారుడు ఉన్నాడు.. కాంగ్రెస్ వైపు ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తి ఉన్నాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దేశ ఎన్నికలకు సెమీ ఫైనల్. కేటీఆర్, కేసీఆర్ ముస్లింల గడపల వద్ద ఓట్ల భిక్షాటన చేస్తున్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ అహాంకారాన్ని కూల్చేవి. మేము మహత్మా గాంధీ వైపు ఉన్నాము. వారు గాడ్సే వైపు ఉన్నారు. పువ్వాడను రాజకీయాల్లో నుంచి భర్తరఫ్ చేయండి. తుమ్మల వయస్సు ఎంత ఉందో అంత మెజార్టీ రావాలి’’ అని ఇమ్రాన్ ప్రతార్ గర్హి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-11-20T21:14:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising