KCR : యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కి సర్జరీ పూర్తి
ABN, First Publish Date - 2023-12-08T21:36:56+05:30
బీఆర్ఎస్ ( BRS ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR ) కి యశోద ఆస్పత్రిలో వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను సోమాజీగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ( BRS ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR ) కి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేశారు. సాయంత్రం 4.30 గంటలకు సర్జరీ కోసం ఆపరేషన్ థియేటర్‌కి కేసీఆర్‌ని తీసుకెళ్లారు. కొద్దిసేపటి క్రితమే కేేసీఆర్‌కి సర్జరీ పూర్తయింది. ఎడమ కాలికి తుంటి మార్పిడి చేశారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ చేసింది. సర్జరీ అనంతరం ఆపరేషన్ థియేటర్ నుంచి కేసీఆర్‌ని రూముకి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ ఉంటారని తెలిపారు. కేసీఆర్ 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.
Updated Date - 2023-12-08T21:51:43+05:30 IST