ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: కరెంట్‌ కావాలా?, కాంగ్రెస్‌ కావాలా? రైతులే ఆలోచన చేయాలి

ABN, First Publish Date - 2023-11-11T17:37:17+05:30

తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఎందుకని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని, 3 గంటల కరెంట్‌ చాలని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఎందుకని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని, 3 గంటల కరెంట్‌ చాలని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడే తెలంగాణ రైతులు బాగుపడుతున్నారని, కాంగ్రెస్‌ తీరుతో రైతులు తిగిరి ఆగమవుతారని కేటీఆర్‌ తెలిపారు.

"రైతులపై కాంగ్రెస్‌కు ఎందుకు ఇంత కక్ష?. 70 లక్షల మంది రైతులను బిచ్చగాళ్లని రేవంత్‌రెడ్డి అన్నారు. కరెంట్‌ కావాలా?, కాంగ్రెస్‌ కావాలా? రైతులే ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పాలనలో బావి దగ్గర నిద్రపోయిన రోజులను రైతులు మరోసారి గుర్తు చేసుకోవాలి. 24 గంటలు కరెంట్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం బెదిరిస్తోంది. మీటర్లు పెట్టకుండా కేంద్రం నుంచి వచ్చే రూ.30 వేల కోట్లు వదులుకున్నాం. కాంగ్రెస్‌ పాలనలో 9 గంటల కరెంట్‌ కూడా ఇవ్వలేదు. రాబందుల కాలం పోయింది.. రైతుబంధు రాజ్యం వచ్చింది. వ్యవసాయాన్ని బాగు చేసే ప్రయత్నం బీఆర్‌ఎస్‌ చేసింది. పెండింగ్‌ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నాం. ధరణి, రైతుబంధు తెచ్చింది రైతుల కోసమే." అని కేటీఆర్‌ అన్నారు.

Updated Date - 2023-11-11T17:38:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising