ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Barrelakka: ఓ వైపు బెదిరింపులు.. మరో వైపు ఆఫర్లు.. బర్రెలక్కపై ఒత్తిడి తెస్తున్న..!

ABN, First Publish Date - 2023-11-24T13:04:45+05:30

నాకు ఇంత మద్దతు వస్తుందని పెద్ద పార్టీలు ఊహించలేదు. మా తమ్ముడిపై దాడి చేసింది అధికార పార్టీ వాళ్లే. ఇంత జరిగినా పోలీసులు మాత్రం మాకు ఎలాంటి భద్రత కల్పించట్లేదు.

కొల్లాపూర్: తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టిస్తున్న కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శరీష సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఏబీఎన్‌తో మాట్లాడారు. తనను విత్‌డ్రా చేసుకోవాలంటూ పెద్ద పార్టీల వాళ్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోటీ నుంచి తప్పుకుంటే ఇంటి స్థలం.. ఇల్లు కట్టిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇలా చాలా మంది తనపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయింది. నామినేషన్ వేసేదాకా తనను ఎవరు పట్టించుకోలేదని.. ఇప్పుడు మాత్రం తనకు వస్తున్న ఆదరణను చూసి ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అన్యాయంగా మా భూమిని కొందరు ఆక్రమించుకున్నారని.. ఎన్నికలయ్యాక వారి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. ఎమ్మెల్యే దగ్గర ఉండేవాళ్లకే దళిత బంధు ఇస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ తాను ఓడిపోయాక దళిత బంధు ఇస్తారేమో చూడాలన్నారు.

‘‘నాకు ఇంత మద్దతు వస్తుందని పెద్ద పార్టీలు ఊహించలేదు. మా తమ్ముడిపై దాడి చేసింది అధికార పార్టీ వాళ్లే. ఇంత జరిగినా పోలీసులు మాత్రం మాకు ఎలాంటి భద్రత కల్పించట్లేదు. పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాం. అయినా భద్రత కల్పించట్లేదు. సోషల్ మీడియాలో చిన్న వీడియో పెట్టినందుకే నాపై కేసు పెట్టారు. కొల్లాపూర్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. మొదటి నుంచి తనది ప్రశ్నించే గొంతుక. అందుకే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాను. తెలంగాణే కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు ఇస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చి నా కోసం ప్రచారం చేస్తున్నారు. ఇంత సపోర్టు దొరకడం చాలా సంతోషంగా ఉంది.’’ అని బర్రెలక్క ఆనందం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే తనకు 2+2 భద్రత కల్పించాలంటూ బర్రెలక్క హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-11-24T13:11:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising