TS Police: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై పోలీస్ శాఖ అలర్ట్
ABN, First Publish Date - 2023-10-31T14:01:06+05:30
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) నిర్వహణపై పోలీస్ శాఖ ( Police Department ) అలర్ట్ అయింది. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తుగా ఉన్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ( Telangana Assembly Elections ) నిర్వహణపై పోలీస్ శాఖ ( Police Department ) అలర్ట్ అయింది. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ సంఖ్యలో బందోబస్తుగా ఉన్నారు. ఆర్వో కార్యాలయాల వద్ద ఎలాంటి శాంతి భద్రతలు విగాతం కలగకుండా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నామినేషన్ కేంద్రాల వద్ద నాలుగు అంచల భద్రతను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఒక్కో నామినేషన్ కేంద్రానికి ఏసీపీ స్థాయి అధికారి నోడల్ ఆఫీసర్‌గా నియామించింది. ర్యాలీలు సమావేశాల అనుమతులపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో సమన్వయంగా ముందుకెళ్లాలని పోలీస్ శాఖ సూచించింది. హైదరాబాద్‌లో 15 నామినేషన్ కేంద్రాలు, రాచకొండలో 8 నియోజకవర్గాలకు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. రాచకొండలో 3,326 పోలింగ్ స్టేషన్లుపై పోలీసు శాఖ నిఘా పెట్టింది. రాచకొండలో 19 చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ప్రతి నియోజకవర్గానికి 3 ఫ్లెయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసింది.
Updated Date - 2023-10-31T14:01:15+05:30 IST