Ponguleti: నన్ను వేధించేందుకే నా ఇళ్లలో ఐటీ తనిఖీలు.. తెలంగాణ ప్రజలు గమనించాలి
ABN, First Publish Date - 2023-11-09T18:54:21+05:30
పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను వేధించేందుకే ఐటీ దాడులు చేయిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు.
ఖమ్మం: పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను వేధించేందుకే ఐటీ దాడులు చేయిస్తున్నారని పొంగులేటి ఆరోపించారు. ఇదేనా ప్రజాస్వామ్యం, ఇంత నీచానికి దిగజారుతారా అని, ఇంత దుర్మార్గం ఎక్కడ చూడలేదని మండిపడ్డారు. న్యాయం గెలుస్తుందని, తెలంగాణ ప్రజలు గమనించాలని, తన వెంట ప్రజలు ఉన్నారని పొంగులేటి స్పష్టం చేశారు.
"నా ఇళ్లలో ఐటీ అధికారులు బీభత్సం సృష్టిస్తున్నారు. కొండను తవ్వి ఎలుకలను కూడా పట్టుకోలేదు. ఒక్క లక్ష కూడా పట్టుకోలేదు. నా కుటుంబ సభ్యులను హౌస్ అరెస్ట్ చేశారు. కొందరి పై మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు. నన్ను మినహా నా భార్య, కుమారుడు, తమ్ముడు అందరినీ అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకెళ్లమన్నారు. ఇదేనా ప్రజా స్వామ్యం. ఇంత నీచానికి దిగజారుతారా. 75 ఏళ్ల ఉన్న నా తల్లిని కూడా హింసించారు. ఇంత దుర్మార్గం ఎక్కడ చూడలేదు. న్యాయం గెలుస్తుంది. నా కుటుంబ సభ్యులను చిత్రహింసలు పెట్టి సంతకాలు చేయించుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు గమనించాలి. నా వెంట ప్రజలు ఉన్నారు. ఐటీ అధికారులకు పూర్తి స్దాయిలో సహకరించాం." అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Updated Date - 2023-11-09T19:00:15+05:30 IST