కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ponnam Prabhakar : నాకు మంత్రి పదవీ అధిష్ఠానం దృష్టిలో ఉంది

ABN, First Publish Date - 2023-12-05T19:43:59+05:30

తనకు మంత్రి పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) తెలిపారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నిక చేయడానికి గెలిచిన ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Ponnam Prabhakar : నాకు మంత్రి పదవీ అధిష్ఠానం దృష్టిలో ఉంది

కరీంగనర్ : తనకు మంత్రి పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ( Ponnam Prabhakar ) తెలిపారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నిక చేయడానికి గెలిచిన ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశాం. అధిష్టానం అన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ప్రకటించింది. రేవంత్‌రెడ్డి సీఎల్పీ నేతగా ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు. పార్టీలో సీనియర్ నేతలు సీఎంగా కావాలని కోరుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అధిష్టానం ఆదేశాల మేరకే ఎవరైనా నడుచుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో జడ్పీ చైర్ పర్సన్‌ని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్‌లో డిసైడ్ చేస్తుంది. అలాగే మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి ఢిల్లీలో నిర్ణయాలు జరుగుతాయి. ప్రజల ఆకాంక్ష మెరుకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉంటుంది’’ అని పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Updated Date - 2023-12-05T19:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising