ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jeevan Reddy : జీవన్‌రెడ్డికి నోటీసులు

ABN, First Publish Date - 2023-12-07T19:49:26+05:30

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ( Jeevan Reddy )కి ఆర్టీసీ, విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని అద్దెకు తీసుకుని ఆ స్థలంలో షాపింగ్ మాల్‌ని జీవన్‌రెడ్డి నిర్మించాడు. అయితే షాపింగ్ మాల్ అద్దెని గత కొంత కాలంగా కట్టకుండా ఎగ్గొడుతున్నాడు.

నిజామాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ( Jeevan Reddy )కి ఆర్టీసీ, విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని అద్దెకు తీసుకుని ఆ స్థలంలో షాపింగ్ మాల్‌ని జీవన్‌రెడ్డి నిర్మించాడు. అయితే షాపింగ్ మాల్ అద్దెని గత కొంత కాలంగా కట్టకుండా ఎగ్గొడుతున్నాడు. సుమారుగా 7.50 కోట్ల అద్దె బకాయిలు చెల్లించకుండా ఆర్టీసీ అధికారులను బెదిరిస్తూ వస్తున్నాడు. అలాగే తన షాపింగ్ మాల్‌కి విద్యుత్ బిల్లులు కూడా చెల్లించడం లేదు.

ఇన్నిరోజులుగా అధికార బలంతో జీవన్‌రెడ్డి అద్దె బకాయిలు అడగడానికి వచ్చిన అధికారులపై చెలరేగిపోయాడు. ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆర్టీసీ , విద్యుత్ అధికారులు రంగంలోకి దిగి జీవన్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి షాపింగ్ మాల్‌‌కి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. షాపింగ్ మాల్‌‌కి బకాయి ఉన్న నగదును వెంటనే చెల్లించాలని లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీసీ, విద్యుత్ అధికారులు హెచ్చరించారు.

Updated Date - 2023-12-07T20:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising