Revanth Reddy: రైతుబంధు నిలిపివేతపై రేవంత్ స్పందన..
ABN, First Publish Date - 2023-11-27T10:37:35+05:30
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా - అల్లుళ్లకు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడమే దీనికి నిదర్శనమన్నారు.

హైదరాబాద్: రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా - అల్లుళ్లకు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడమే దీనికి నిదర్శనమన్నారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదన్నారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దన్నారు. మంత్రి హరీశ్ రావు వల్లే రైతుబంధు ఆగిందని.. కాంగ్రెస్ వచ్చిన 15 రోజుల్లో పైసలిస్తమని రేవంత్ రెడ్డి తెలిపారు.
రైతుబంధు పంపిణీకి ఈసీ ఇచ్చిన అనుమతిని కేసీఆర్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఏదో ప్రయోజనం కోరి చివరి వరకూ రైతుబంధును పంపిణీ చేయకుండా నిలిపివేస్తే.. ఈలోగా ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసేసుకుంది. ఈ నెల 24 నుంచి రైతుబంధు అనుమతికి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. అయితే సీఈసీ నిబంధనలు ఉలంగించినందుకు అనుమతి రద్దు చేసింది.
Updated Date - 2023-11-27T11:01:02+05:30 IST