ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mallu Bhatti Vikramarka: 'దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా.. నా దృష్టికి వచ్చే ఏ విషయంలోనూ పక్షపాతం చూపను'

ABN, First Publish Date - 2023-12-07T14:14:24+05:30

Deputy CM Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ ఎన్నికల్లో మరోసారి మధిర శాసనసభ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగి విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన లింగాల కమల్ రాజును ఆయన ఓడించారు.

Deputy CM Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ ఎన్నికల్లో మరోసారి మధిర శాసనసభ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగి విజయం సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన లింగాల కమల్ రాజును ఆయన ఓడించారు. ఇక తాజాగా తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో భట్టికి ఉపముఖ్యమంత్రి పదవీ దక్కింది. ఆయన పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే.. తొలిసారి 2009 ఎన్నికలలో మధిర ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014లో కూడా ఇక్కడి నుంచే విజయం సాధించారు. అలాగే 2009 నుండి 2011 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ విప్‌గా పని చేశారు. 2011 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా కూడా ఉన్నారు.

అలాగే 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా భట్టి విక్రమార్క మధిర నుంచి గెలిచారు. ఇలా మధిర నుంచి వరుసగా 2009, 2014, 2018లో గెలుపొంది హ్యాట్రిక్ నమోదు చేశారు. దీంతో బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచారు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా నియామకమయ్యారు. 2023 ఎన్నికల్లో కూడా మధిర ప్రజలు మల్లు భట్టి విక్రమార్క గెలిపించారు. దాంతో ఇప్పుడు ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవీ దక్కింది.

Updated Date - 2023-12-07T14:29:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising