ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy : జడ్పీటీసీ నుంచి సీఎం కుర్చీ దాకా.. రేవంత్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు!

ABN, First Publish Date - 2023-12-03T19:52:43+05:30

ఆయన.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నాయకుడు. ప్రజల నాడి పట్టి వారిలో చైతన్యం నింపే నేత. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజా సమస్యలే ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్.

ఆయన.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే నాయకుడు. ప్రజల నాడి పట్టి వారిలో చైతన్యం నింపే నేత. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజా సమస్యలే ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేసిన లీడర్. ఈ అంశాలే ఆయన్ని పురాతన జాతీయ పార్టీకి రాష్ట్ర బాధ్యతలు చేపట్టేలా చేసింది. అదీ అనధి కాలంలోనే. ఇప్పుడు ఏకంగా సీఎం రేసులోకి రావడంతో తెలంగాణ ప్రజల చూపంతా ఆ నేతపైనే ఉంది. ఇప్పటికే మీకర్థం అయి ఉంటుంది. ఆయనెవరో కాదు.. అనుముల రేవంత్ రెడ్డి. పెయింటర్ నుంచి యువ నాయకుడిగా ఎదిగి.. సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టి తన రాజకీయ ప్రయాణానికి సుస్థిర బాటలు వేసుకున్న రేవంత్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం..

వ్యక్తిగత విషయాలు..

రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన సతీమణి గీత. తండ్రి అనుముల నర్సింహారెడ్డి, తల్లి అనుముల రామచంద్రమ్మ. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గ్యాడ్యుయేషన్ పట్టా పొందారు. రేవంత్ రెడ్డికి తొలుత ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆయన కింది స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. మొదట జడ్పీటీసీ ఇండిపెండెంట్ గా గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్(బీఆర్ఎస్), బీజేపీ వంటి పార్టీలను ఎదుర్కొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ నుంచి 2007లో జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ గెలుపుతో పార్టీలన్నీ ఒక్కసారిగా రేవంత్ వైపు చూసేలా చేశాయి. అక్కడే ఆయన నాయకత్వం బయటపడింది. తర్వాత ఎమ్మెల్సీగా గెలిచారు. అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్.. పార్టీలో జాయిన్ కావాలని ఆహ్వానించినా.. దివంగత సీఎం ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అభిమానంతో టీడీపీలో చేరారు.

తెలుగుదేశం పార్టీ నుంచి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ అభ్యర్థులు రావులపల్లి గుర్నాథ్ రెడ్డి పై విజయం సాధించారు. ఆ విజయం ఆయన చరిష్మాను మరింతగా పెంచింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున మరోసారి బరిలోకి దిగి ఆయన ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండేవారు.

2014 – 2017 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. 2017 అక్టోబర్‌లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. 3 ఏళ్ల అనధికాలంలోనే ఎవ్వరికీ దక్కని హోదాతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 మే లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అనంతరం రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా (టీపీసీసీ) జూన్ 26, 2021లో కాంగ్రెస్ పార్టీ నియమించింది. 2021 జులై 7న అప్పటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి కేసీఆర్ పాలనపై వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఆయన్ని ఓడించడం కోసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు.

ఓటుకు నోటు కేసు..

ఇక శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వజూపిన కేసులో మే 31 2015న, రేవంత్ రెడ్డిపై స్టింగ్ ఆపరేషన్ చేసి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అరెస్టు చేసింది. అవినీతి నిరోధక చట్టం, సెక్షన్లు 120-B (నేరపూరిత కుట్ర) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు – ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 34 కింద రేవంత్‌తో పాటు మరో ఇద్దరు - బిషప్ సెబాస్టియన్ హ్యారీ, ఉదయ్ సింహాలను అరెస్ట్ చేసింది. వీరిని చర్లపల్లి సెంట్రల్ జైలుకి తరలించింది. జూన్ 30న వీరికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 2015 జులై 1న రేవంత్ రెడ్డి విడుదలయ్యారు. ఈ కేసు తాలూకు చేదు అనుభవాలు ఇప్పటికీ రేవంత్‌ని వెంటాడుతున్నాయి.

ఏదేమైనా రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు కాంగ్రెస్ ముందు ఆరు గ్యారంటీ స్కీమ్‌లు ఉన్నాయి. అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవల్సి ఉంటుంది. ఎలా ముందుకెళ్తారో వేచి చూడాలి.

Updated Date - 2023-12-03T21:28:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising