ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR: కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే..?

ABN, First Publish Date - 2023-12-09T20:02:07+05:30

బీఆర్ఎస్ ( BRS ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR ) కి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో శుక్రవారం నాడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ పూర్తి చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: బీఆర్ఎస్ ( BRS ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR ) కి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో శుక్రవారం నాడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల బృందం తెలిపింది. కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌ బులెటిన్‌ను సోమాజీగూడలోని యశోద ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. కేసీఆర్‌కి తుంటి నొప్పి తగ్గిందని రోజంతా విశ్రాంతి తీసుకున్నారని చెప్పారు. మల్టీ డిసిప్లినరీ డాక్టర్ల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ అంబులేషన్ మార్గదర్శకాల ప్రకారం హిప్ రీప్లేస్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని 12గంటల లోపు నడిపించాలని అందులో భాగంగానే కేసీఆర్ కొంత సమయం నడిచారని వైద్యుల బృందం తెలిపింది. ఆర్థోపెడిక్ సర్జన్ ఫిజియోథెరపీ బృందం పర్యవేక్షణలో కేసీఆర్ నడిపించామని చెప్పారు. కేసీఆర్‌ 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-12-09T20:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising