ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Balapur Ganesh: బాలాపూర్ లడ్డూ @ రూ.27 లక్షలు

ABN, First Publish Date - 2023-09-28T11:08:36+05:30

బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ ధర రూ.27 లక్షలు పలికింది. తుర్కయంజాల్‌కు చెందిన దాసరి దయానందరెడ్డి రెడ్డి బాలపూర్ గణేష్ లడ్డూను కైవసం చేసుకున్నాడు. అంతకుముందు బాలాపూర్ గణేష్‌ శోభాయాత్ర వైభవంగా జరిగింది. బాలాపూర్ పురవీధుల్లో ఊరేగింపుగా సంస్కృతి కార్యక్రమాలు, భజనలతో శోభాయాత్ర శోభాయామానంగా సాగింది.

హైదరాబాద్: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ ఏడాది వేలంపాటలో బాలాపూర్ లడ్డూ ధర రూ.27 లక్షలు పలికింది. తుర్కయంజాల్‌కు చెందిన దాసరి దయానందరెడ్డి రెడ్డి గణేష్ లడ్డూను కైవసం చేసుకున్నారు. అంతకుముందు బాలాపూర్ గణేష్‌ శోభాయాత్ర వైభవంగా జరిగింది. బాలాపూర్ పురవీధుల్లో ఊరేగింపుగా సంస్కృతి కార్యక్రమాలు, భజనలతో శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. గ్రామం అంతా బాలాపూర్ గణేషుడిని ఊరేగించిన అనంతరం బొడ్రాయి వద్ద బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు లడ్డూ వేలం పాటను నిర్వహించారు.


ఇదిలావుండగా నేటితో బాలాపూర్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. గతేడాది 24 లక్షల 60 వేల రూపాయలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ.. ఈ సారి ఏకంగా మరో రూ.2.40 లక్షలు పెరిగి రూ.27 లక్షలు పలికింది. గతేడాది బాలాపూర్ లడ్డూను వంగేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి రూ.24లక్షల 60వేలకు దక్కించుకున్నారు. ఈ సారి లడ్డూ వేలం పాటలో 9 మంది సభ్యులు పాల్గొనగా.. అందులో ఆరుగురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు ఉన్నారు. గతేడాది లడ్డూను దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఈసారి కూడా వేలం పాటలో పాల్గొన్నారు. ముందుగా ఉత్సవ సమితి కమిటీ సభ్యులు రూ.5 లక్షల నుంచి వేలం పాటను ప్రారంభించారు. లడ్డూ వేలం పాటలో గట్టి పోటీ జరిగింది. చివరకు దాసరి దయానందరెడ్డి రూ.27 లక్షలకు బాలాపూర్ గణేష్ లడ్డూను సొంతం చేసుకున్నారు.


30 ఏళ్లుగా లడ్డూ విజేతలు వీరే...

  • 1994లో కొలను మోహన్‌రెడ్డి- రూ.450

  • 1995లో కొలను మోహన్‌రెడ్డి- రూ.4,500

  • 1996లో కొలను కృష్ణారెడ్డి- రూ.18 వేలు

  • 1997లో కొలను కృష్ణారెడ్డి- రూ.28 వేలు

  • 1998లో కొలన్‌ మోహన్‌ రెడ్డి లడ్డూ- రూ.51 వేలు

  • 1999 కళ్లెం ప్రతాప్‌ రెడ్డి- రూ.65 వేలు

  • 2000 కొలన్‌ అంజిరెడ్డి- రూ.66 వేలు

  • 2001 జీ. రఘనందన్‌ రెడ్డి- రూ.85 వేలు

  • 2002లో కందాడ మాధవరెడ్డి- రూ.1,05,000

  • 2003లో చిగిరినాథ బాల్‌ రెడ్డి- రూ.1,55,000

  • 2004లో కొలన్‌ మోహన్‌ రెడ్డి- రూ.2,01,000

  • 2005లో ఇబ్రహీ శేఖర్‌- రూ.2,08,000

  • 2006లో చిగురింత తిరుపతి- రెడ్డి రూ.3 లక్షలు

  • 2007లో జీ రఘనాథమ్‌ చారి- రూ.4,15000

  • 2008లో కొలన్‌ మోహన్‌ రెడ్డి- రూ.5,07,000

  • 2009లో సరిత- రూ.5,10,000

  • 2010లో కొడాలి శ్రీధర్‌ బాబు- రూ.5,35,000

  • 2011లో కొలన్‌ బ్రదర్స్‌- రూ.5,45,000

  • 2012లో పన్నాల గోవర్ధన్‌ రెడ్డి- రూ.7,50,000

  • 2013లో తీగల కృష్ణారెడ్డి- రూ.9,26,000

  • 2014లో సింగిరెడ్డి జైహింద్‌ రెడ్డి- రూ.9,50,000

  • 2015లో కొలన్‌ మధన్‌ మోహన్‌ రెడ్డి- రూ.10,32,000

  • 2016లో స్కైలాబ్‌ రెడ్డి- రూ.14,65,000

  • 2017లో నాగం తిరుపతి రెడ్డి- రూ.15 లక్షల 60 వేలు

  • 2018లో తేరేటి శ్రీనివాస్‌ గుప్తా- రూ.16,60,000

  • 2019లో కొలను రామిరెడ్డి- రూ.17 లక్షల 60 వేలు

  • 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు

  • 2021లో మర్రి శశాంక్‌ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌- రూ.18.90 లక్షలు

  • 2022లో వంగేటి లక్ష్మారెడ్డి- రూ.24,60,000

  • 2023లో దాసరి దయానంద్ రెడ్డి – రూ. 27 ల‌క్ష‌లు

Updated Date - 2023-09-28T11:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising