The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమా చూసిన బండి సంజయ్
ABN, First Publish Date - 2023-05-08T19:16:18+05:30
"ది కేరళ స్టోరీ" సినిమాను బీజేపీ నేత బండి సంజయ్ చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి సీఎం కేసీఆర్.. "ది కేరళ స్టోరీ" సినిమా చూడాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. "ది కేరళ స్టోరీ" లాంటి సినిమాలు వారానికి ఒకటి తీస్తామని ప్రకటించారు.
హైదరాబాద్: "ది కేరళ స్టోరీ" (The Kerala Story) సినిమాను బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) చూశారు. కాచిగూడ తారకరామ థియేటర్లో బీజేపీ నేతలతో కలిసి సినిమా చూశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి సీఎం కేసీఆర్ (CM KCR).. "ది కేరళ స్టోరీ" సినిమా చూడాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. "ది కేరళ స్టోరీ" లాంటి సినిమాలు వారానికి ఒకటి తీస్తామని ప్రకటించారు. "ది కేరళ స్టోరీ" వంటి సినిమాలకు టాక్స్లో మినహాయింపు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్ (Hyderabad)లో మైనర్ ముస్లిం అమ్మాయిలను.. సౌదీ షేక్ వచ్చి పెళ్లి చేసుకుని తీసుకు వెళ్తున్నారని, పాతబస్తీ మహిళలకు రక్షణ ఇవ్వకుండా మజ్లిస్ ఏం చేస్తోంది? అని బండి ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం వచ్చాకనే అన్ని వర్గాల మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. "ది కేరళ స్టోరీ" సినిమా డైరెక్టర్, నిర్మాతకు బెదిరింపులు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. 14న కరీంనగర్లో నిర్వహిస్తోన్న హిందూ ఏక్తా యాత్రకు "ది కేరళ స్టోరీ" డైరెక్టర్, ప్రొడ్యూసర్ వస్తున్నారని బండి సంజయ్ తెలిపారు.
Updated Date - 2023-05-08T19:16:20+05:30 IST