ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Elections 2023: మొరాయిస్తున్న ఈవీఎంలు.. పలుచోట్ల నిలిచిన పోలింగ్

ABN, First Publish Date - 2023-11-30T09:10:13+05:30

Telangana Polls: తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం అయింది. అయితే, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 33వ బూత్‌లో ఈవీఎంలు మొరయించడంతో అర్ధగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.

Telangana Polls: తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం అయింది. అయితే, కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 33వ బూత్‌లో ఈవీఎంలు మొరయించడంతో అర్ధగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అలాగే కొయ్యలగూడెం 63వ బూత్‌లో సైతం ఈవీఎంలు మొరాయించాయి. దీంతో క్యూలో ఓటర్లు వేచి చూస్తున్నారు. అటు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలోని 282, 286 పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు పనిచేయక పోవడంతో పోలింగ్ నిలిచిపోయింది.

వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం రాంపూర్ తండాలోని పోలింగ్ బూత్ 211లో 6 ఓట్లు పోల్ అయిన తర్వాత ఈవీఎం మెషిన్ పనిచేయలేదు. దాంతో ఎన్నికల అధికారులు మరో ఈవీఎంను పెట్టారు. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపు ఆగిపోయింది. అలాగే వికారాబాద్‌లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బాన్సువాడ (డి) గ్రామంలోని పోలింగ్ సెంటర్ 54లో ఈవీఎం మోరాయించింది. దీంతో పోలింగ్ గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. అలాగే సిద్దిపేట జిల్లా చిన్నకొడూర్ మండలం గంగాపూర్‌లో కూడా ఈవీఎం మెషిన్ మొరాయించింది. అటు సంగారెడ్డి జిల్లా ఆందోల్ (మం) జోగిపేట పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలోని పోలింగ్ బూత్ 200లో ఈవీఎం మొరాయించింది. దాంతో ఈ పోలింగ్ బూత్‌లో గంటపాటు పోలింగ్ నిలిచిపోయింది. అలాగే ఎర్రుపాలెంలోని వెంకటాపురం గ్రామంలో పోలింగ్ బూత్ 259లో ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా మొదలైంది

Updated Date - 2023-11-30T09:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising