Osmania University: ఉస్మానియా యూనివర్శిటీ పీజీ సర్టిఫికెట్లలో తప్పుల తడకలు
ABN, First Publish Date - 2023-05-31T08:23:29+05:30
విద్యార్థులకు చదువు చెప్పే ఉస్మానియా యూనివర్శిటీ జారీ చేసిన పీజి సర్టిఫికెట్లు తప్పుల తడకలుగా మారాయి. స్పెల్లింగ్ తప్పులకు తోడు విద్యార్థిని తండ్రి పేరు వద్ద తల్లి పేరు, తల్లి పేరు వద్ద తండ్రి పేరు ముద్రించి విద్యార్థులకు షాక్ ఇచ్చారు....
హైదరాబాద్ : విద్యార్థులకు చదువు చెప్పే ఉస్మానియా యూనివర్శిటీ జారీ చేసిన పీజి సర్టిఫికెట్లు తప్పుల తడకలుగా మారాయి. స్పెల్లింగ్ తప్పులకు తోడు విద్యార్థిని తండ్రి పేరు వద్ద తల్లి పేరు, తల్లి పేరు వద్ద తండ్రి పేరు ముద్రించి విద్యార్థులకు షాక్ ఇచ్చారు.(Mistakes) హైదరాబాద్ నగరంలోని ఆజంపురా ప్రాంతానికి చెందిన జెబా తబుస్సుం అనే విద్యార్థిని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ చదివారు. పీజీ కోర్సు పూర్తి చేయడంతో యూనివర్శిటీ జెబాకు పీజీపీ 148109 నంబరుతో ప్రొవిజనల్ సర్టిఫికెట్ ను జారీ చేసింది.(Osmania University PG Certificates) ఈ సర్టిఫికెట్ లో పలు తప్పులు దొర్లాయి.
ఇది కూడా చదవండి: MS Dhoni Viral Pic: భార్య సాక్షి, కూతురు జివాతో కలిసి ధోనీ ఫ్యామ్-జామ్ చిత్రం
ఓయూ రిజిస్ట్రార్ సంతకం చేసి, యూనివర్శిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ స్టాంపు వేసి జారీ చేసిన సర్టిఫికెట్ లో విద్యార్థిని తల్లిదండ్రుల తారుమారు చేసి ముద్రించారు.ఆపై తమ తప్పు తెలుసుకున్న ఓయూ అధికారులు దాన్ని పెన్నుతో కొట్టివేసి గ్రీన్ ఇంకు పెన్నుతో రాసి ఓయూ గజిటెడ్ అధికారి సంతకం చేశారు. జెబా తబుస్సుంకు జారీ చేసిన సెమిస్టర్ గ్రేడ్ సర్టిఫికెట్లలోనూ పలు తప్పులు దొర్లాయి. తల్లిదండ్రుల పేర్లను ఒక్కో మార్కు లిస్టులో ఒక్కో రకంగా స్పెల్లింగ్ మిస్టేకులతో రాశారు. మొత్తం నాలుగు సర్టిఫికెట్లలో 10 తప్పులు రాసి యూనివర్శిటీ అధికారులు తమ ఘనతను చాటుకున్నారు.
ఇది కూడా చదవండి: Punjab: పంజాబ్ మంత్రివర్గ విస్తరణ...ఇద్దరు ఎమ్మెల్యేలకు చోటు
తన పీజీ ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పుల తడకలు,పలు కొట్టివేతలు, కరెక్షన్లతో జారీ చేయడంతో జెబా తబుస్సుం తీవ్ర ఆవేదన చెందారు. ఉస్మానియా యూనివర్శిటీ అధికారులే ఇల్లా తప్పుల తడకలతో పీజీ సర్టిఫికెట్లు జారీ చేస్తే ఎలా అని విద్యార్థిని జెబా తండ్రి మహ్మద్ అబ్దుల్ రషీద్ ప్రశ్నించారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల జారీలోనే తప్పులు రాసిన ఓయూ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇకనైనా ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్,రిజిస్ట్రార్, ఓయూ వర్శిటీ అధికారులు జోక్యం చేసుకొని తన కుమార్తె జెబా తబుస్సుం పీజీ ప్రొవిజనల్,సెమిస్టర్ గ్రేడ్ సర్టిఫికెట్లను తప్పులు లేకుండా జారీ చేయాలని అబ్దుల్ రషీద్ అభ్యర్థించారు.
Updated Date - 2023-05-31T08:25:55+05:30 IST