BJP: ఈటలకు బీజేపీ హైకమాండ్ మందలిపు.. చర్చనీయాంశంగా రాజాసింగ్, ఈటల ఎపిసోడ్.. !
ABN, First Publish Date - 2023-07-19T18:42:02+05:30
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలవటంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై జాతీయ నాయకత్వం సీరియస్ అయింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ ఇంటికి ఈటల వెళ్లారు.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను (Raja singh) కలవటంపై బీజేపీ (BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై (Etela Rajender) జాతీయ నాయకత్వం సీరియస్ అయ్యింది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్ ఇంటికి వెళ్ళడం సరి కాదంటూ ఈటలకు అధిష్టానం హితవు పలికింది. ఒక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినందుకు గత ఆగస్టులో రాజాసింగ్‌ను బీజేపీ హైకమాండ్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటివల మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుతో సమావేశమవ్వడంతో పార్టీ బోతున్నారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రాజాసింగ్ (Raja singh) నివాసానికి బీజేపీ ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Etela Rajender) బుధవారం వెళ్లి కలిశారు. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు.. కార్పొరేటర్ పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఈటల దృష్టికి రాజాసింగ్ తీసుకెళ్లారు. తనపై హైకమాండ్ విధించిన సస్పెన్షన్‌పై ఈటలతో రాజాసింగ్ చర్చించారు. సస్పెన్షన్ ఎత్తివేసేలా అధిష్టానాన్ని కోరతానని రాజసింగ్‌కు ఈటల రాజేందర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా బోనాల పండగ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య గోషామహల్‌లో గొడవ జరిగింది. మంగళ్ హాట్ డివిజన్‌లో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య వార్ మొదలైంది. మంగళ్ హాట్ బీజేపీ కార్పొరేటర్ శశికళపై పోలీసులు వన్‌సైడ్‌గా కేసులు నమోదు చేశారని బీజేపీ పేర్కొంది. రాజసింగ్ నివాసంలో మంగళ్ హాట్ కార్పొరేటర్ శశికళను ఈటల పరామర్శించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో ఈటల కాసేపు మాట్లాడారు. బీఆర్ఎస్‌తో ఫ్లెక్సీ గొడవపై కార్పొరేటర్ శశికళను ఈటల అడిగి తెలుసుకున్నారు. రాజాసింగ్, ఈటల రాజేందర్ సమావేశ వీడియో బయటకు వచ్చింది. దీంతో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటలపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయినట్లు సమాచారం. రాజాసింగ్, ఈటల ఎపిసోడ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-07-19T19:17:14+05:30 IST