BJP: కమలం.. వ్యూహమిదేనా... ఆలస్యాన్ని అధిగమించే ప్రయత్నం
ABN, First Publish Date - 2023-11-11T08:36:00+05:30
నామినేషన్ చివరి రోజు వరకు కూడా బీజేపీ(BJP) కొందరు అభ్యర్థులను ప్రకటించలేదు. జాబితా ఆలస్యం

- సమావేశాలకే ఎక్కువ ప్రాధాన్యం
- సుడిగాలి పర్యటనలకు ప్రణాళికలు
- పార్టీ, ఇతర పార్టీల్లోని అసంతృప్తులపై ఫోకస్
బీఆర్‌ఎస్ అందరికంటే ముందుగానే అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్ కూడా మెజార్టీ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. జాబితా ప్రకటనలో బీజేపీ మొదటి నుంచీ ఆలస్యమే. దీంతో అభ్యర్థులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ప్రత్యర్థులకు దీటుగా నిలవడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. విస్తృతంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): నామినేషన్ చివరి రోజు వరకు కూడా బీజేపీ(BJP) కొందరు అభ్యర్థులను ప్రకటించలేదు. జాబితా ఆలస్యం కావడం వల్ల టికెట్ ఆశించిన నేతలను, అసంతృప్తులను బుజ్జగించడానికే సమయం పడుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని పరుగులు పెట్టించేందుకు పాదయాత్రలు, కాలనీ సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని అభ్యర్థులు ప్లాన్ చేస్తున్నారు. ప్రధానం రాత్రి పూట సమావేశాలు, రహస్య మంతనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావి స్తున్నారు. ఎక్కువగా బైక్ ర్యాలీలు, సుడిగాలి పర్యటనలు చేపట్టనున్నారు.
పార్టీలోని అసంతృప్తులతో పాటు..
ముందుగా అసంతృప్తులను దారికి తెచ్చుకునే ప్రయత్నాల్లో అభ్యర్థులు ఉన్నారు. ఒకవైపు తమ పార్టీ నాయకులు, అసంతృప్తులతో మాట్లాడుతూనే మరో వైపు ఇతర పార్టీల్లోని అసంతప్తులను కూడా కలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. బహిరంగంగా లేకపోయినా అంతర్గతంగా అయినా మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
పాత వాళ్లే కావడం ప్లస్
టికెట్లు దక్కిన అభ్యర్థులు దాదాపు పాత వారే కావడం, అప్పటికే వారు ఓటర్లు, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఉండడం అనుకూలిస్తుందని భావిస్తున్నారు. చివరి జాబితాలో టికెట్ పొందిన ఎన్. రామచంద్రరావు, రవికుమార్ యదవ్‌లు కూడా ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటించారు. రెండో జాబితాలో పేర్లున్న ఎన్వీఎ్‌సఎస్ ప్రభాకర్, మర్రి శశిధర్‌రెడ్డి, కృష్ణయాదవ్‌లకు పలుమార్లు పోటీ చేసిన అనుభవం ఉంది. ఇంటింటికి వెళ్లి కేంద్రం సంక్షేమ పథకాలు, బీసీ సీఎం వంటి అంశాలను ఓటర్లకు చేరవేస్తున్నారు.
Updated Date - 2023-11-11T08:36:01+05:30 IST