ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: ఆశల పల్లకిలో కమలం.. ఆరు సీట్లపై ధీమా

ABN, First Publish Date - 2023-12-02T09:06:43+05:30

బీజేపీకి హైదరాబాద్‌ ప్రతిష్ఠాత్మకం. 2014లో ఐదు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2018లో ఒకే స్థానంతో బీజేపీ

పోలింగ్‌ అనంతరం ఓటింగ్‌ సరళిని బట్టి గ్రేటర్‌లో ఆరు స్థానాలపై బీజేపీ(BJP) అగ్రనేతలు ఆశలు పెట్టుకున్నారు. త్రిముఖ పోటీలో తమ అభ్యర్థులదే పై చేయి అవుతుందని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): బీజేపీకి హైదరాబాద్‌ ప్రతిష్ఠాత్మకం. 2014లో ఐదు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2018లో ఒకే స్థానంతో బీజేపీ సరిపెట్టుకుంది. ప్రస్తుతం పోలింగ్‌ ముగియడంతో ఫలితాలపై ఆ పార్టీ నేతలు లెక్కల్లో మునిగిపోయారు. ఈ ఫలితాల ప్రభావం పార్లమెంట్‌ ఎన్నికలపై ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఆ సీట్లపైనే నమ్మకం

గోషామహల్‌ నుంచి రాజాసింగ్‌, రాజేంద్రనగర్‌ నుంచి తోకల శ్రీనివాస్‏రెడ్డి, మహేశ్వరం నుంచి అందెల శ్రీరాములు యాదవ్‌, అంబర్‌పేట నుంచి కృష్ణాయాదవ్‌, శేరిలింగంపల్లి నుంచి రవికుమార్‌ యాదవ్‌, కుత్బుల్లాపూర్‌ నుంచి కూన శ్రీశైలంగౌడ్‌ విజయం సాధిస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఇందులో ప్రతికూల ఫలితం వచ్చినా గ్రేటర్‌లోని మిగతా ప్రాంతాల్లో విజయం వరిస్తుందని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ఓటింగ్‌ సరళి, త్రిముఖ పోటీ తమకు కలిసొస్తుందని పలువురు అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

లాభించనున్న త్రిముఖ పోటీ

గ్రేటర్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో రెండో స్థానంలో ఉంటామని, లేకపోతే అక్కడ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఖైరతాబాద్‌, కంటోన్మెంట్‌, మలక్‌పేట, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారని, ఇక్కడ రెండో స్థానంలో నిలిచే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇందులోని ఒకటి, రెండు స్థానాల్లో గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. యాకుత్‌పురాలో ఈ సారి పోలింగ్‌ శాతం తగ్గిందని, ఇది ప్రత్యర్థులకు మైనస్‌ అయి తమకు లాభిస్తుందని భావిస్తున్నారు.

Updated Date - 2023-12-02T09:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising