Etala Rajender: కాంగ్రెస్‌లోకి రేవంత్ రెడ్డి అహ్వానంపై స్పందించిన ఈటల
ABN, First Publish Date - 2023-05-18T18:58:07+05:30
కాంగ్రెస్ పార్టీలోకి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అహ్వానంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సహా ఎవరూ బీజేపీని వీడరని, బీజేపీ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని ఈటల స్పష్టం చేశారు. బీఆర్ఎస్ (BRS) బయటకు పంపిన నాడు తనకు బీజేపీ గౌరవం, ధైర్యం ఇచ్చిందని ఈటల వెల్లడించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోకి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అహ్వానంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender) స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సహా ఎవరూ బీజేపీని వీడరని, బీజేపీ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని ఈటల స్పష్టం చేశారు. బీఆర్ఎస్ (BRS) బయటకు పంపిన నాడు తనకు బీజేపీ గౌరవం, ధైర్యం ఇచ్చిందని ఈటల వెల్లడించారు. కాంగ్రెస్, BRS సీనియర్ నేతలే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. BRSను ఓడించగలిగే శక్తి బీజేపీకి మాత్రమే ఉందని, క్షణికావేశంతో కాదు.. ఆలోచనతో మాత్రమే బీజేపీలో చేరామని ఆయన చెప్పారు. ఈటల రాజేందర్ క్యారెక్టర్.. తెరిచిన పుస్తకమని, రేవంత్ చిల్లర మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదని ఈటల మండిపడ్డారు.
వివేక్ (Vivek), ఈటల (Etala), విశ్వేశ్వర రెడ్డి (Visveswara Reddy) లాంటి వాళ్లు కాంగ్రెస్ (Congress)లోకి రావాలని ఆహ్వానిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. వివేక్, ఈటల, కొండా లాంటి వాళ్ళు క్షణికావేశంలో బీజేపీలో చేరారని, బీజేపీ సిద్దాంతంతో సంబంధంలేనివాళ్ళు కొందరు బీజేపీని నమ్మి ఆ పార్టీలో చేరారన్నారు. సీఎం కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ చేయాలనుకునే వాళ్ళు కాంగ్రెస్‌లోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను నాయకుడ్ని కాదని, సోనియా, ఖర్గేలే నాయకులన్నారు. తన వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే... ఒక మెట్టు కాదు పది మెట్లు దిగడానికి తాను సిద్ధమన్నారు.
Updated Date - 2023-05-18T19:00:05+05:30 IST