MLC Kavitha : బంగాళాఖాతం అడుగుకు వెళ్లి మరీ కవితకు విషెస్ చెప్పిన బీఆర్ఎస్ నేత

ABN, First Publish Date - 2023-03-13T08:56:41+05:30

తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం సర్వసాధారణమే. కానీ కొందరు మాత్రం వినూత్నంగా చెప్పి ఆకట్టుకుంటారు.

MLC Kavitha : బంగాళాఖాతం అడుగుకు వెళ్లి మరీ కవితకు విషెస్ చెప్పిన బీఆర్ఎస్ నేత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్ : తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం సర్వసాధారణమే. కానీ కొందరు మాత్రం వినూత్నంగా చెప్పి ఆకట్టుకుంటారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్ను గౌడ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో బంగళా ఖాతం సముద్రపు అంచులలోకి వెళ్లి మరీ విషెస్ చెప్పాడు. ఇతరులు ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. బంగాళాఖాతంలో నీటి అడుగున డైవింగ్ చేస్తూ చిన్నూగౌడ్ బ్యానర్లను ప్రదర్శించడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను టీస్ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ చేతుల మీదుగా ఆదివారం రాత్రి 12 గంటలకు విడుదల చేశారు.

Updated Date - 2023-03-13T08:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising