ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhatti Vikramarka: బీఆర్‌ఎస్‌ పాలనంతా స్కాములమయం: భట్టి విక్రమార్క

ABN, First Publish Date - 2023-03-27T20:54:59+05:30

బీఆర్‌ఎస్‌ (BRS) పాలనంతా స్కాములమయంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు. హాత్‌సే హాత్‌ జోడో పాదయాత్రలో భాగంగా కుమరం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆసిఫాబాద్‌: బీఆర్‌ఎస్‌ (BRS) పాలనంతా స్కాములమయంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు. హాత్‌సే హాత్‌ జోడో పాదయాత్రలో భాగంగా కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేల కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ, లక్షకోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజలకు తాగునీరు, సాగునీరందలేదన్నారు. లిక్కర్‌ స్కాముతో ఎమ్మెల్సీ కవిత (MLC Kavatha) తెలంగాణ సమాజానికి తలవంపులు తెచ్చింద న్నారు. అవినీతిని ఉడ్చేస్తానన్న ఢిల్లీ ముఖ్యమంత్రి లిక్కర్‌ కుంభకోణంలో కూరుకుపోయారన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)ని శిక్షించడం భారత ప్రజాస్వామ్యాన్ని శిక్షించడమేనన్నారు. జలయజ్ఞం కింద కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టులు నిర్మిస్తే బీఆర్‌ఎస్‌ పాలనలో కాలువలు నిర్మించలేని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కౌటాల మండలంలోని తుమ్మిడి హెట్టి వద్ద రూ. 38 వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే దానిని కాదని రూ. లక్షా 25 వేల కోట్లకు పెంచి కమీషన్లకు కక్కుర్తిపడి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. దానివల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని భట్టి విక్రమార్క విమర్శించారు.

Updated Date - 2023-03-27T20:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising