TS News: భానుడి భగభగ..
ABN, First Publish Date - 2023-06-01T20:53:42+05:30
రోహిణీకార్తె కావడంతో భానుడు మరింత భగ్గుమంటున్నాడు. ఉమ్మడిఖమ్మంజిల్లాలో ఎండ, వడగాలుల తీవ్రగా ఎక్కువగా ఉండగా.. పారిశ్రామిక, గనుల ప్రాంతాల్లో మరింత హీటెక్కుతోంది.
ఖమ్మం: రోహిణీకార్తె కావడంతో భానుడు మరింత భగ్గుమంటున్నాడు. ఉమ్మడిఖమ్మంజిల్లాలో ఎండ, వడగాలుల తీవ్రగా ఎక్కువగా ఉండగా.. పారిశ్రామిక, గనుల ప్రాంతాల్లో మరింత హీటెక్కుతోంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఓ వైపు నిప్పుల జిమ్ముతున్న భానుడు.. మరోవైపు వడగాలులతో తప్పనిసరైతే తప్ప బయటకు అడుగుపెట్టడంలేదు. గురువారం ముదిగొండ మండలం పమ్మి, ఖమ్మం నగరంలోని ఖానాపురం, నేలకొండపల్లిలో అత్యధికంగా 44.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ముదిగొండ మండలం బాణాపురంలో 44.7, ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం, సత్తుపల్లి, చింతకానిలో 44.5 డిగ్రీలు, భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం యానంబైలులో 44.9,డిగ్రీలు నమోదైంది.
Updated Date - 2023-06-01T20:56:05+05:30 IST