CEC Rajivkumar: తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.17 కోట్లు.. ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పిన సీఈసీ..
ABN, First Publish Date - 2023-10-05T13:46:56+05:30
హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని.. ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలతోనూ సమావేశమైనట్లు తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యామని.. ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలతోనూ సమావేశమైనట్లు తెలిపారు. అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరాయన్నారు. తెలంగాణాలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు అని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557, వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 ఉన్నారన్నారు.
తెలంగాణ ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించామని.. రాష్ట్రంలో 2022-23లో 22 లక్షల ఓట్లను తొలగించామని చెప్పారు. ఫామ్ అందిన తర్వాతే ఓట్లను తొలగించామని వెల్లడించారు. ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో 8.11 లక్షల కొత్త ఓటర్ల నమోదు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణాలో మహిళలు, పురుష ఓటర్లు సమానంగా ఉన్నారన్నారు. 80 ఏళ్ళు దాటిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం ఉందని అన్నారు. 35,356 మొత్తం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసుకోవచ్చు...
‘‘రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. యంగెస్ట్ స్టేట్ తెలంగాణ... తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రధాన్యత ఉంది. ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్‌తో పనిచేస్తున్నాం. రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ళ నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. అక్రమ నగదు - మద్యాన్ని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్బన్ ఏరియాల్లో మైక్రో అబ్జార్వార్లను పెట్టాలని కోరారు. 119 సెగ్మెట్లలో 88 జనరల్, ఎస్టీ 12, ఎస్సీ 19 ఉన్నాయి. 80 ఏళ్లకు పైబడిన వాళ్ళు 4.43లక్షలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అడ్రెస్స్ ఇస్యు ఉన్నది. యువత - మహిళా ఓట్లను పెంచేందుకు మేమెంతో కృషి చేసాం... సక్సెస్ అయ్యాము. మొదటిసారి తెలంగాణలో వృద్ధులు ఇంటి వద్దే ఓటు వేయడానికి ఫామ్ 12డీ ఏర్పాటు చేస్తున్నాం. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం. అక్రమంగా నగదు మద్యం సరఫరా చేస్తే సీ విజిల్ యాప్‌లో ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి. ప్రతీ ఒక్కరూ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. సువిధ పోర్టల్ ప్రతీ అభ్యర్థి డౌన్లోడ్ చేసుకోవాలి.. సమాచారం తెలుసుకోవచ్చు. KYC అంటే KNOW YOUR CANDIDATE క్రిమినల్ బ్యాగ్రండ్ చెక్ చేసుకోవచ్చు. బర్దార్‌లో చెక్ పోస్ట్‌లు 89, మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు. అక్రమంగా నగదు - మద్యం సరఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. ఆన్లైన్‌లో నగదు బదిలీలపై ఈసీ నిఘా ఉంటుంది. హెలిప్యాడ్స్, ఎయిర్పోర్ట్‌లలో ప్రత్యేక నిఘా. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ప్రతీ వారానికి ఒకసారి రిపోర్ట్ చేయాలని ఆదేశించాం. ఆరోపణలు(ఫిర్యాదు )వచ్చిన ప్రతీ నాయకులు సమాధానం చెప్పాలి. ప్రకటనలు - సోషల్ మీడియాలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి. ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల కోసం అబ్జర్లు కేంద్రం నుంచి విధులు నిర్వహిస్తారు. ఎన్నికలు పారదర్శనంగా జరిపేందుకు అన్ని పక్కడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం’’ అంటూ సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
కాగా.. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటించింది. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను బృందం పరిశీలించింది. అలాగే ఈరోజు తెలంగాణ సీఎస్, డీజీపీని సీఈసీ బృందం కలిసింది. రాష్ట్రంలో పరిస్థితులు, ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో శాంతిభద్రతలపై సీఈసీ బృందం ఆరా తీసింది.
Updated Date - 2023-10-05T14:21:49+05:30 IST