Medigadda Barrage: మేడిగడ్డ డ్యామ్ కుంగటంపై కేంద్రం సీరియస్
ABN, First Publish Date - 2023-10-23T13:54:56+05:30
మేడిగడ్డ బ్యారేజ్ 20వ పిల్లర్ కుంగటంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇందుకుగల కారణాలను పరిశీలించడానికి కేంద్ర కమిటీని కేంద్రం నియమించింది.
న్యూఢిల్లీ: మేడిగడ్డ బ్యారేజ్ 20వ పిల్లర్ కుంగటంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇందుకుగల కారణాలను పరిశీలించడానికి కేంద్ర కమిటీని కేంద్రం నియమించింది. సీడబ్ల్యూసీ, డీఆర్ సభ్యుడు, ఎన్‌డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో 6 సభ్యులతో ఈ కమిటీని ప్రకటించింది. ఎస్‌కే శర్మ, ఆర్.తంగమణి, రాహుల్ కే సింగ్, దేవేంద్ర రావు, కేజీబీవో డీడీ (కేజీబీవో హైదరాబాద్ సీఈ నామినేట్ చేస్తారు) సభ్యులుగా ఉంటారు. 23న (నేడు) సందర్శన ప్రారంభించి పరిశీలన అనంతరం రిపోర్ట్‌ను అందజేయనుందని తెలియజేస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ 6 - 8 బ్లాకులకు సంబంధించిన 15 - 20 నంబర్ల పిల్లర్లు అక్టోబర్ 21 రాత్రి కుంగాయి. కాబట్టి, డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021లో షెడ్యూల్-2లోని పేరా ప్రకారం కారణాలు పరిశీలించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు ఎన్‌డీఎస్ఏ సెక్రటేరియెట్ డైరెక్టర్ రాకేష్ కుమార్ గౌతమ్ సర్క్యూలర్ విడుదల చేశారు.
Updated Date - 2023-10-23T13:54:56+05:30 IST